ఐమాక్స్ లో ప్రేక్షకుల ఆందోళన!

Published : Aug 02, 2019, 10:46 AM IST
ఐమాక్స్ లో ప్రేక్షకుల ఆందోళన!

సారాంశం

హాలీవుడ్ లో తెరకెక్కిన 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ సినిమాలకు తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉంటుంది.

ఐమాక్స్‌లో సరదాగా సినిమా చూద్దామని ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొని తీరా థియేటర్‌కు వచ్చేసరికి సినిమాలు ప్రదర్శన లేదని బోర్డులు పెట్టడంతో ప్రేక్షకులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఘర్షణ వాతావరణం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ లో తెరకెక్కిన 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ సినిమాలకు తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే షో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి జనాలు ఎగబడుతుంటారు.

కానీ ఐమాక్స్ థియేటర్ నిర్వాహకులు మొదటి షో క్యాన్సిల్ చేశారు. దీంతో ప్రేక్షకులు.. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టికెట్ డబ్బులు వాపస్ చేస్తామని సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో విషయం మరింత పెద్దదైంది. షో క్యాన్సిల్ చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. 
 
 

PREV
click me!

Recommended Stories

Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?