తప్పు శృతిదే, బ్లాక్ మెయిల్ ఆరోపణలపై నిర్మాత స్పందన!

Published : Apr 02, 2019, 09:37 AM IST
తప్పు శృతిదే, బ్లాక్ మెయిల్ ఆరోపణలపై నిర్మాత స్పందన!

సారాంశం

శృతిహాసన్ ను  నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) బ్లాక్ మెయిల్ చేశారని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపించిన సంగతి తెలిసిందే.  

శృతిహాసన్ ను  నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) బ్లాక్ మెయిల్ చేశారని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపించిన సంగతి తెలిసిందే.  ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, కాల్ షీట్లు తీసుకున్నారని అన్నారు. సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్లను ఏడిపించారని, మహేష్ బాబును తప్ప ప్రతి హీరోను ఇబ్బంది పెట్టారని తెలిపారు. 

ఒక్క మహేష్ బాబు మాత్రమే పీవీపీ చేతికి చిక్కలేదని అన్నారు. డైరెక్టర్లను కూడా ఏడిపించారని విమర్శించారు. లీగల్ నోటీసుల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి, డేట్లను తీసుకునేవారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఇతనంటే అసహ్యం పుట్టిందని చెప్పారు.

అయితే హీరోయిన్ శ్రుతి హాస‌న్‌తో పాటు ప‌లువ‌రు హీరో,హీరోయిన్స్ ని బెదిరించాన‌ని త‌న‌పై ఎంపీ నాని చేసిన‌ ఆరోప‌ణ‌ల‌ను నిర్మాత పీవీపీ తోసిపుచ్చారు.  పీవీపీ తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు.

పీవీపీ మాట్లాడుతూ..."ఊపిరి సినిమాషూటింగ్ మ‌ధ్య‌లోనే శ్రుతి హాస‌న్ వెళ్లిపోయింది. త‌ప్పు ఆమెదే. అందుకే రెమ్యునేషన్  తిరిగి తీసుకున్నాం. అందులో త‌ప్పు ఏముంది. అనుష్క‌, త‌మ‌న్న‌, స‌మంత‌... ఇలా ఎంద‌రో పెద్ద హీరోయిన్లు మా సంస్థ‌లో ప‌ని చేశారు. ఎవ‌రూ ఆరోప‌ణ‌లు చేయ‌లేదు క‌దా. నాని ఇలాంటి త‌ప్పుడు మాట‌లు బంద్ చేయాలి," అని పీవీపీ ఘాటుగా స్పందించారు. 

ఇక పీవీపీ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. విజ‌య‌వాడ ఎంపీగా వైకాపా త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు పీవీపీ. ఆయ‌న‌కి పోటీగా ఉన్న తెలుగుదేశం అభ్య‌ర్తి నాని ఇటీవ‌ల తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు.

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు