
సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి ప్రమోషన్స్ స్థాయి రోజురోజుకి పెరిగిపోతోంది. ఫొటోస్- సాంగ్స్ తో మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా మార్కెట్ కి సంబందించిన న్యూస్ ల వల్ల కూడా సినిమా రేంజ్ పెరుగుతోంది. ఇక ఉగాది ఫెస్టివల్ కి తెలుగు ప్రేక్షకులందరిని అలరించడానికి మహర్షి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
సినిమా టీజర్ ను ఉగాది రోజున రిలీజ్ చెయ్యాలని మహేష్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఎందుకంటే సినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క నెల మాత్రమే ఉంది. పండగ సీజన్ లో టీజర్ ను వదిలి ఒక్కసారిగా బజ్ క్రియేట్ చెయ్యాలని దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం దగ్గరుండి టీజర్ ను కట్ చేయిస్తున్నాడట.
ఫైనల్ గా తెలుగు కొత్త సంవత్సరం నాడు మహర్షి అందరికి చేరువవ్వాలని టీజర్ ను రెడీ చేస్తున్నారు. ఇక సినిమాను మే9న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ చివరలో సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. మరి సినిమా మహేష్ కి ఎలాంటి రికార్డులను అందిస్తుందో చూడాలి.