‘పుష్పక విమానం’ ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

Surya Prakash   | Asianet News
Published : Dec 02, 2021, 04:56 PM IST
‘పుష్పక విమానం’ ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

సారాంశం

 ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్పకవిమానం’. నవంబర్‌ 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద జస్ట్ ఓకే అనిపించుకుంది.  తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్ర టీమ్ ప్రకటించింది.

మన చుట్టూ ఉండే కథలనే సినిమాలుగా చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు ఆనంద్‌ దేవరకొండ. తన అన్నయ్య విజయ్‌దేవరకొండ నీడలో ఇండస్ట్రీకి వచ్చినా మాస్‌ కథల జోలికి పోకుండా సామాన్య పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే ‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’తో డీసెంట్‌ హిట్‌ కొట్టి ‘పుష్పక విమానం’అంటూ మరో చిత్రంతో మన ముందుకు వచ్చారు. ఈ చిత్రం త్వరలో ఓటీటిలో పలకరించబోతోంది.

 ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్పకవిమానం’. నవంబర్‌ 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆనంద్‌ దేవరకొండ నటన చాలా బాగుందని అందరూ ప్రశంసించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్ర టీమ్ ప్రకటించింది. డిసెంబర్‌ 10వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.   ఈ విషయాన్ని ఆహా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారు ఇక ఆహాలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

 విజయ్‌దేవరకొండ   నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించటం ప్రత్యేకం.  డార్క్‌ కామెడీతో ఈ చిత్రం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడం ఖాయం అంటూ ప్రచారం చేసారు. అప్పట్లో కమల్‌హాసన్‌, అమల జంటగా సింగితం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో ‘పుష్పక విమానం’ పేరుతో వచ్చిన మూకీ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే!
 
దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్‌ అమాయకుడైన స్కూల్‌ టీచర్‌ పాత్ర పోషించారు. కామెడీ, సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో గీతాషైనీ, శాన్వి మేఘన, సునీల్‌, హర్షవర్ధన్‌, నరేశ్‌ కీలకపాత్రలు పోషించారు. విజయ్‌ దేవరకొండ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బోర్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే