‘పుష్ప 2’ రిలీజ్ డేట్ వెనక వెయ్యి కోట్ల స్ట్రాటజీ

Google News Follow Us

సారాంశం

పుష్ప2 సినిమాను 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు మేకర్స్.


అల్లు అర్జున్(Allu arjun) హీరోగా వస్తున్న పుష్ప2(Pushpa2)రిలీజ్ డేట్ ప్రకటించటమే సినీ ప్రియుల్లో హాట్ టాపిక్. పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ  పాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీగా ఉండటంతో అందుకు తగ్గట్లుగానే తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ కోసం అటు నార్త్ ఆడియన్స్, ఇటు సౌత్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారనే విషయం గమనించి రిలీజ్ డేట్ ని ప్లాన్ చేసి ప్రకటించారు.  ఈ సినిమాను 2024 స్వతంత్ర దినోత్సవ సందర్బంగా ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ డేట్ చూసి చాలా మంది షాక్ అ్యయారు. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయ్యిన ఈ సినిమా ఇంత లేటు రిలీజ్ ఏంటనేది ఒకటి అయితే అసలు ఆ డేట్ ఎంపిక కు ప్రత్యేకమైన రీజన్ ఉందా అని ఆరాతీస్తున్నారు.

అయితే పుష్ప2 ని ఆగస్ట్ 15న కన్ఫర్మ్ చేయడానికి పెద్ద కారణముంది. ఆగస్టు 15 గురువారం సెలవు. దీని తర్వాత శుక్ర-శని-ఆదివారం వీకెండ్ కలిసొచ్చేస్తుంది. ఆ తర్వాత సోమవారం 19 వ తేదీ రక్షా బంధన్(రాఖీ).. ఇలా ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ఉంది. ఆ తర్వాత 23 నుంచి 25 దాకా వీకెండ్ , 26 ఆగస్ట్ జన్మాష్టమి..ఇన్ని వరస పెట్టి కలిసి వస్తున్నాయి. ఐదు రోజులు ఫస్ట్ వీకెండ్, నాలుగు రోజులు సెకండ్ వీకెండ్..ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా పఠాన్, జవాన్ లను దాటేస్తుంది. ఈజీగా వెయ్యి కోట్లు చేసేస్తుంది. అదీ పుష్పగాడి లెక్క అంటున్నారు.
 
వాస్తవానికి పుష్ప స్క్రిప్ట్ వర్క్ కోసమే దాదాపు సంవత్సర కాలం తీసుకొన్నారు మేకర్స్. ఆతరువాత ప్రీ ప్రొడక్షన్ కోసం మరో ఆరునెలల సమయం పట్టింది. దీంతో చాలా లేటుగా సెట్స్ పైకి వెళ్ళింది పుష్ప. ఇక పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఏర్పడటంతో ముందు అనుకున్న కథలో చాల మార్పులు చేసినట్లు సమాచారం. ఇందుకోసం కొత్త సెట్స్ కూడా వేయాల్సి వచ్చింది. ఆ కారణంగా కూడా పుష్ప షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. 
 
 ‘పుష్ప ది రూల్‌’లో  రష్మిక (Rashmika) హీరోయిన్ గా శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. విలన్  పాత్రలో ఫహద్ ఫాజిల్ కనిపించనున్నారు. పార్ట్‌ 1కు వచ్చిన ఓ రేంజి అప్లాజ్ ని  దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌ లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్‌పై ఇది ప్రతిష్ట్మాత్మక చిత్రం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. దానికి తోడు  పుష్ప పార్ట్‌ 1కు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ జాతీయ అవార్డుకు ఎంపికవటం కూడా కలిసి వచ్చే అంశం. 

చిత్రం కథ విషయానికి వస్తే.. ఎస్పీ భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్ (ఫహాద్ ఫాజిల్‌)తో పుష్పరాజ్‌కు ఎలాంటి విరోధం ఏర్పడింది. పుష్పరాజ్‌ను అంతం చేయడానికి షెకావత్‌ ఏం చేశాడు? స్మగ్లింగ్‌ సిండికేట్‌కు కింగ్‌ అయిన తర్వాత పుష్పరాజ్‌ తదుపరి స్టెప్‌ ఏమిటి? అనే విషయాలతో ‘పుష్ప 2’ ఉండొచ్చని సినీ ప్రియులు అనుకుంటున్నారు.

Read more Articles on