అల్లు అర్జున్ ఆ స్టార్స్ ఇద్దరికీ ఓపెన్ ఛాలెంజ్, వెనకడుగు వేస్తారా? తగ్గేదేలే అంటారా?


బాక్సాఫీసు ఏలడానికి పుష్పరాజ్ మరోసారి వస్తున్నాడంటూ మైత్రీ మూవీ మేకర్స్  పేర్కొంది. రక్తం అంటిన పుష్పరాజ్ చేతిని కూడా పోస్టు చేసింది.ఇప్పుడే అసలు కథ మొదలైంది.

Google News Follow Us


  సినీ ప్రియులందరూ ఎదురుచూస్తున్న చిత్రాల్లో  ఒకటైన‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule)రిలీజ్ డేట్ ఇవ్వటం ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్‌ (Allu Arjun)హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఈ కీలక అప్‌డేట్‌  ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ‘పుష్ప ది రూల్‌’ ను ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనపై బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రక్క ఈ సినిమాతో పోటీ పడే చిత్రాలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు పుష్ప అంటున్నారు.  ఇంతకీ అదే రోజు రిలీజయ్యే చిత్రాలు ఏమిటనేది చూస్తే...

ఇప్పటిదాకా ట్రేడ్ లో ఉన్న లెక్కలు ప్రకారం ... ఆగస్టు 15నే.. కమల్-శంకర్ 'భారతీయుడు 2' కూడా రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసారు. అదే జరిగితే తమిళంలో ఖచ్చితంగా ఈ సినిమాకు పోటీ ఉంటుంది. మనకు ఎలా ఉన్నా అక్కడ అల్లు అర్జున్ vs కమల్ పోటీలో ఉన్నట్లే!అలాగే నార్త్  బెల్ట్ లో  #SinghamAgain ని అదే రోజు రిలీజ్ ప్లాన్ చేసారు. అంటే అక్కడ  అల్లు అర్జున్ vs అజయ్ దేవగన్. అయితే పుష్ప మీద ఈ రేంజి క్రేజ్ ఉన్నప్పుడు ఈ రెండు సినిమాలు పోటీకు వస్తాయా అనేది ప్రశ్నార్దకమే. ఎందుకంటే థియేటర్స్ సమస్య వచ్చేస్తుందని ప్రక్కకు తప్పుకుని వేరే రిలీజ్ డేట్ చూసుకుంటారు. అందుకే దాదాపు ఏడాది గ్యాప్ లో రిలీజ్ డేట్ ప్రకటించారు.  

 ‘పుష్ప ది రూల్‌’లో  రష్మిక (Rashmika) హీరోయిన్ గా శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. విలన్  పాత్రలో ఫహద్ ఫాజిల్ కనిపించనున్నారు. పార్ట్‌ 1కు వచ్చిన ఓ రేంజి అప్లాజ్ ని  దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌ లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్‌పై ఇది ప్రతిష్ట్మాత్మక చిత్రం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. దానికి తోడు  పుష్ప పార్ట్‌ 1కు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ జాతీయ అవార్డుకు ఎంపికవటం కూడా కలిసి వచ్చే అంశం. 

చిత్రం కథ విషయానికి వస్తే.. ఎస్పీ భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్ (ఫహాద్ ఫాజిల్‌)తో పుష్పరాజ్‌కు ఎలాంటి విరోధం ఏర్పడింది. పుష్పరాజ్‌ను అంతం చేయడానికి షెకావత్‌ ఏం చేశాడు? స్మగ్లింగ్‌ సిండికేట్‌కు కింగ్‌ అయిన తర్వాత పుష్పరాజ్‌ తదుపరి స్టెప్‌ ఏమిటి? అనే విషయాలతో ‘పుష్ప 2’ ఉండొచ్చని సినీ ప్రియులు అనుకుంటున్నారు.