4నెలలు దాటినా.. ఏమాత్రం తగ్గని పుష్ప మ్యానియా.. న్యూయార్క్ ను తాకిన బన్నీ ప్రభావం

Published : Apr 14, 2022, 01:17 PM ISTUpdated : Apr 14, 2022, 01:18 PM IST
4నెలలు దాటినా.. ఏమాత్రం తగ్గని పుష్ప మ్యానియా.. న్యూయార్క్ ను తాకిన బన్నీ ప్రభావం

సారాంశం

రిలీజ్ అయ్యి నాలుగు నెలలు దాటినా.. పుష్ప ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. పుష్ప పాటలకు ఫిదా అయిన చాలా మంది ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో రీమిక్స్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా న్యూయార్క్ వీధుల్లో పుష్ప మోత మోగిపోయింది.   

రిలీజ్ అయ్యి నాలుగు నెలలు దాటినా.. పుష్ప ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. పుష్ప పాటలకు ఫిదా అయిన చాలా మంది ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో రీమిక్స్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా న్యూయార్క్ వీధుల్లో పుష్ప మోత మోగిపోయింది. 

అల్లు అర్జున్,రష్మిక జంటగా సుకుమార్ సృష్టించిన అద్భుతం పుష్ప. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈమూవీకి బ్రహ్మరధం పట్టారు ఫ్యాన్స్. పుష్ప మ్యానియాకు దేశమంతా ఊగిపోయింది. ముఖ్యంగా పుష్ప పాటకు విదేశాల్లో సైతం అభిమానులు తయారయ్యారు. సామాన్యుల దగ్గర నుంచి స్టార్స్ వరకూ.. అందరూ పుష్ప పాటలతో సందడి చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. 

ఇక ఇప్పుడు పుష్ప మ్యానియా న్యూయార్క్ వీధులనూ తాకింది. ఇండియన్  ఫేమస్  కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతా పుష్ప పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. అది కూడా తన ఇంట్లోనో, స్టూడియోలోనో కాదు. అసలు ఇండియాలోనే కాదు. న్యూయార్క్ వీధుల్లో పుష్ప పాటకు డాన్స్ వేశారు డాన్సర్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

 

 

 కుర్తా, స్కర్ట్ వేసుకుని పుష్ప సినిమాలోని సామి సామి పాటకి వేసిన స్టెప్పులు అక్కడున్న వారందరి దృష్టిని ఆకర్షించాయి. నెట్టింట్లో  ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ స్టెప్పులు కంప్లీట్ ఎనర్జిటిక్ గా ఉండగా.. జైనిల్ గెటప్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంది. డిఫరెంట్ గెటప్ అందరిని ఆకర్శించింది. ఇదే సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టి ని బాగా ఆకర్షించింది.  అతడి వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉండడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. 

మిడ్డీ మాదిరిగా ఉన్న కుర్తా వేసుకున్న జైనిల్.. దానిపై స్కర్ట్ వేసుకున్నాడు. కొత్తగా ఉన్న ఈ గెటప్, డాన్స్ వీడియోను  ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా..ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల మంది చూసేశారు.  జైనిల్ డ్యాన్స్ చేస్తుండగా.. వెనుక నుంచి మన్ హట్టన్ బ్రిడ్జి అద్బతంగా కనిపిస్తుంది. ఇక ముందుకూడా పుష్ప ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. . ఏదైనా కొంచెం వినూత్నంగా చేస్తే చాలు అది నేడు సామాజిక మాధ్యమాల సాయంతో లక్షలాది మందికి వేగంగా చేరిపోతోంది. ఇది కూడా అటువంటిదే. ఇదిగో.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?