
తెలుగు బుల్లితెరపైనే కాదు.. ఇండియన్ టెలివిజన్‌లోనే మునుపెన్నడూ లేని టిఆర్పీలను పరిచయం చేసిన సీరియల్‘కార్తీక దీపం’అని తెలిసిందే. గత కొంతకాలంగా తెలుగు ప్రేక్షకులకు ఈ సీరియల్ అనేది ఓ అడిక్షన్ గా మారిందనటంలో అతిశయోక్తి లేదు. సీరియల్ లోని వంటలక్క అనేది పాత్ర పేరు కాదు.. ఒక కామన్ డిస్కషన్ విషయంగా మారింది. అయితే మనుపటి మ్యాజిక్ ఇప్పుడు చేయడంలో వెనకబడిపోతుంది కార్తీక దీపం అనేది నిజం.
ఇప్పటికే 1200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది కార్తీక దీపం సీరియల్. వంటలక్క క్రేజ్ ముందు టిఆర్పీ లు వచ్చి సాగిలపడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ ఈ సీరియల్‌పై వచ్చినన్ని మీమ్స్ మరే సీరియల్‌పై రాలేదు కూడా. అయితే ఇవన్నీ ఒకప్పుడు మాత్రమే.. కొన్ని వారాలుగా కార్తీక దీపం హవా పూర్తిగా తగ్గిపోయింది. అదే ఛానెల్‌లో వచ్చే గృహలక్ష్మి లాంటి సీరియల్స్ పుంజుకున్నాయి. ఇవి ప్రక్కన పెడితే..
వంటలక్క పాత్రలో నటిస్తున్న ప్రేమీ విశ్వనాథ్ తనకు సంబంధించిన అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తన ఫేస్ బుక్ ఖాతా వేదికగా ఓ ప్రకటన చేశారు. ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. డ్రైవర్, అకౌంటెంట్ ఉద్యోగాల అభ్యర్థులు కావాలని తెలిపారు.
డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారికి అన్ని రకాల 4 వీలర్స్ (Automatic, Manual) వాహనాలను నడిపడం వచ్చి ఉండాలని ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు కొచ్చిలోని ఎర్నాకులంలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా అకౌంటెంట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారికి Tally వచ్చి ఉండాలన్నారు. మీకూ అవసరం అనుకుంటే ఓ లుక్కేయచ్చు.
ఇక 2017లో మొదలైన కార్తీక దీపం.. అనేక మలుపులు తిరుగుతూ 2022లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మధ్య సీరియల్ అయిపోతుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అలాంటిదేం లేదని.. మరో ఏడాదిన్నర వరకు కూడా ఈ సీరియల్‌కు ఢోకా లేదని తెలుస్తుంది. ఎందుకంటే కథ లాగుతున్న.. సాగుతున్న తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇప్పటికీ అదే స్లో నెరేషన్ సాగుతుంది.