Pushpa: 'ఊ అంటావా ఊహూ అంటావా' సాంగ్ అప్డేట్.. అందాలతో హీటెక్కించబోతున్న సామ్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 08, 2021, 08:31 PM IST
Pushpa: 'ఊ అంటావా ఊహూ అంటావా' సాంగ్ అప్డేట్.. అందాలతో హీటెక్కించబోతున్న సామ్

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికి వరకు పుష్ప చిత్రం నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ మొత్తం సినిమాపై అంచనాలు పెంచే విధంగానే ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికి వరకు పుష్ప చిత్రం నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ మొత్తం సినిమాపై అంచనాలు పెంచే విధంగానే ఉంది. సోమవారం విడుదలైన పుష్ప ట్రైలర్ సినిమాపై అంచనాలని రెట్టింపు చేసింది. 

అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర కథ ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరగనుంది. ఇదిలా ఉండగా పుష్ప చిత్రం నుంచి మరో కిక్కిచ్చే సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దేవిశ్రీ సంగీత దర్శకత్వంలో ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ మొత్తం యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. 

సుకుమార్ చిత్రాల్లో ఐటమ్స్ సాంగ్స్ మాస్ ప్రేక్షకులకు అసలు సిసలైన మజా అందిస్తాయి. పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ తో డబుల్ డోస్ కిక్కిచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ లో సమంత అల్లు అర్జున్ తో కలసి స్టెప్పులేయబోతున్న సంగతి తెలిసిందే. సమంత తన కెరీర్ లో తొలి సారి ఐటెం సాంగ్ చేస్తున్న చిత్రం ఇది. తాజాగా పుష్ప చిత్ర యూనిట్ ఈ స్పెషల్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది. 

స్పెషల్ సాంగ్ లో సమంత లుక్ ని రివీల్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు. 'ఊ అంటావా ఊహూ అంటావా' అంటూ సాగే ఈ పాటని డిసెంబర్ 10న లిరికల్ వీడియో రూపంలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సమంత లుక్ చూస్తుంటే ఈ సాంగ్ లో తన గ్లామర్ తో హీటెక్కించబోతున్నట్లు అర్థం అవుతోంది. ఇక అల్లు అర్జున్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Also Read: ఇషా గుప్తా అందాల బ్లాస్టింగ్.. నెవర్ బిఫోర్ అనిపించేలా క్లీవేజ్ షో

మొత్తంగా దేవిశ్రీ ప్రసాద్ థియేటర్లు మోతెక్కే సాంగ్ నే రెడీ చేస్తున్నారు. డిసెంబర్ 17న పుష్ప చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అల్లు అర్జున్ కి జోడిగా ఈ చిత్రంలో రష్మిక మందన నటిస్తోంది. సునీల్, అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Richest Music Directors: ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో తెలుసా?
Shruti Haasan: కమల్ హాసన్ కూతురు రజినీకాంత్ కు అభిమాని ఎలా అయింది? అసలు విషయం ఏంటంటే?