#Pushpa: రాజమౌళి దారిలోనే రష్యాకు అల్లు అర్జున్

Published : Nov 08, 2022, 08:03 AM IST
 #Pushpa: రాజమౌళి దారిలోనే  రష్యాకు అల్లు అర్జున్

సారాంశం

రీసెంట్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కలిసి జపాన్ వెళ్లి వచ్చారు. అక్కడ ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి,విజయం సాధించింది. దాంతో ఈ హీరోల తదుపరి సినిమాలకు అక్కడ మార్కెట్ ఓపెన్ అవ్వటం జరుగుతోంది.


ఇప్పుడు హీరోలు దృష్టి అంతా ప్యాన్ ఇండియా సినిమాలపై ఉంది. అదే విధంగా తమ సినిమాలను అంతర్జాతీయ ప్రేక్షకులు అలరించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తమ మార్కెట్ ని విస్తరించేందుకు తెగ కష్టపడుతున్నారు. అందుకోసం దేశ,విదేశాల్లో టూర్స్ వేస్తున్నారు. ఇప్పటికి ఆర్.ఆర్ ఆర్ టీమ్ విదేశాల్లో తమ సినిమాను ఓ రేంజిలో ప్రమోట్ చేస్తోంది. రీసెంట్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కలిసి జపాన్ వెళ్లి వచ్చారు. అక్కడ ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి,విజయం సాధించింది. దాంతో ఈ హీరోల తదుపరి సినిమాలకు అక్కడ మార్కెట్ ఓపెన్ అవ్వటం జరుగుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రష్యాలో తన చిత్రాన్ని ప్రమోట్ చేయబోతున్నారు. 

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైజ్ సినిమా ఎంత పెద్ద హిట్టైందో అందరికీ తెలుసు. ఆ సక్సెస్ వైబ్రేషన్స్ ఇప్పటికి ఎక్కడో చోట తగులుతూనే ఉన్నాయి. తెలుగులోనే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలై సూపర్ హిట్ గా నిలవటం అల్లు అర్జున్ కెరీర్ కు పెద్ద బూస్టప్ గా మారింది. తెలుగులో అద్భుతమైన కలెక్షన్లు సాధించిన ఈ సినిమా హిందీలో కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలోనే రెండో భాగం మీద దర్శక నిర్మాతలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇదిలా ఉండగా ఈ డిసెంబర్ నెలలో ఈ సినిమాని రష్యాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 గత సెప్టెంబర్ నెలలో ఈ సినిమాని ఇంగ్లీష్ అలాగే రష్యన్ సబ్ టైటిల్స్ తో మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ క్రమంలో పుష్ప సినిమాకి అక్కడ అద్భుతమైన స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఆ స్పందన చూసిన దర్శక నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నాకు. అందుకే దాన్ని రష్యన్ భాషలో డబ్బింగ్ చేయించి భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడా రిలీజ్ కు అల్లు అర్జున్ స్వయంగా సుకుమార్ తో కలిసి వెళ్లి ఎగ్రిసివ్ గా ప్రమోట్ చేయనున్నారు. అక్కడ కూడా మంచి హిట్ అయితే  పుష్ప2  సినిమా ఇక్కడ రిలీజ్ చేసిన డేట్ కే  రష్యన్ వెర్షన్ కూడా రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలుగు తేజాలు ప్రపంచమంతటా వికసిస్తున్న సమయం ఇది. 
 

PREV
click me!

Recommended Stories

Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్
ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి