సత్యదేవ్ ‘ఫుల్ బాటిల్’ నుంచి ఫస్ట్ లుక్.. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న పోస్టర్!

Published : Nov 02, 2022, 01:11 PM IST
సత్యదేవ్ ‘ఫుల్ బాటిల్’ నుంచి ఫస్ట్ లుక్..  ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న పోస్టర్!

సారాంశం

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫుల్ బాటిల్’. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా సత్యదేవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ డిజైన్ సినిమాపై ఆసక్తిని కలుగజేస్తోంది.

రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటారు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satyadev). ‘బ్లఫ్ మాస్టర్’తో తన సత్తా చూపించిన డైనమిక్ యాక్టర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’లో నెగెటివ్ రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. అలాగే హిందీలో రూపొంది దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామ్ సేతు’లోనూ కీలక పాత్ర పోషించి అలరించారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

ప్రస్తుతం సత్యదేవ్ నటిస్తున్న మూడు చిత్రాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. అందులో ఒకటి ‘ఫుల్ బాటిల్’ (Full Bottle). నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నా సత్యదేవ్.. తానే నిర్మాతగా మారి ఎస్‌డీ కంపెనీ పేరుతో ఓ నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించాడు. ఈ సంస్థ నుంచి వస్తున్న చిత్రమే `ఫుల్ బాటిల్‌`. ఇందులో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గా సంజనా ఆనంద్ నటిస్తోంది. శ‌ర‌ణ్ కొప్పి శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఏప్రిల్ లోనే టైటిల్ పోస్ట‌ర్‌ను లాంచ్ చేశారు. 

తాజాగా సత్యదేవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ డిజైన్ మాత్రం సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. ‘మెర్కూరి సూరి’ (Mercury Soori)గా సత్యదేవ్ అలరించబోతున్నారు. కొత్తలుక్ లో ఆకట్టుకుంటున్నాడు. గత చిత్రాలతో పోల్చితే భిన్నమైన క్యారెక్టర్ లో అలరించబోతున్నాడని తెలుస్తోంది. కాకినాడ పోర్టు నేపథ్యంలో సినిమా తెరకెక్కబోతోంది. ఇదో క్రైమ్ కామెడీ చిత్రంగా తెలుస్తోంది. ఎస్డీ కంపెనీ, శర్వంత్రమ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి, సత్యదేవ్ నిర్మిస్తతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మరోవైపు సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’, ‘కృష్ణమ్మ’ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?