
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప టీం అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ తో పాటు పుష్ప 2 నుంచి ఎవ్వరూ ఊహించని విధంగా బన్నీ సరికొత్త లుక్ ను పరిచయం చేసింది. గంగమ్మ జాతర అమ్మోరి లుక్ లో బన్నీని చూపించిన సుకుమార్(Sukumar) సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాడు. ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ‘పుష్ప2.. ద రూల్ బిగిన్స్’ అంటూ విడుదలైన ఈ లుక్.. ట్విట్టర్ లో ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. ఈ నేపధ్యంలో మరో విషయం బయిటకు వచ్చింది. టీమ్ టార్గెట్ నార్త్ ఇండియా.
ఇక్కడ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎలాగూ క్రేజ్ భీబత్సంగా ఉంటుంది. కానీ నార్త్ లో ఎలా ఉంటుందనే భయం ఉంది. అయితే హింది గ్లింప్స్ కు వచ్చిన క్రేజ్ ఆ భయాలను చెల్లా చెదురు చేసింది. యూట్యూబ్ లో తెలుగులో విడుదలైన గ్లింప్స్ ని దాటి హిందీ గ్లింప్స్ కు రికార్డ్ వ్యూస్ వచ్చాయి. నార్త్ ఆడియెన్స్ లో పుష్ప క్రేజ్ కు ఇది నిదర్శనం. దాంతో సుకుమార్ ఆలోచన నెరవేందని చెప్పాలి. ఎందుకంటే బాహుబలి, కేజీఎఫ్ రెండు సినిమాల ఫస్ట్ పార్ట్ నెక్ట్స్ లెవిల్ లో ముగియగా.. పుష్ప ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో అంత ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ లేదు అని అంతటా వినపడింది.
దాంతో కేజీఎఫ్ 2, బాహుబలి 2 తరహాలో పుష్ప 2 భారీ బజ్ క్రియేట్ చేయలేకపోతుందని, దీని సీక్వెల్ కు ఆసక్తి కలిగించే కథాంశం లేదని కొన్ని ప్రేక్షక వర్గాలు, ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే పుష్ప 2 గ్లింప్స్ కి వచ్చిన రెస్పాన్స్ అన్ని అనుమానాలను నివృత్తి చేసింది. వేర్ ఈజ్ పుష్ప హిందీ గ్లింప్స్ కు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. మరో ప్రక్క విడుదలైన అతి తక్కువ సమయంలోనే అత్యధిక లైకులు సాధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ గా నిలిచింది. ఇప్పటి వరకు రాంచరణ్ గేమ్ ఛేంజర్ పోస్టర్ పేరిట ఉన్న ఈ రికార్డును పుష్ప రాజ్ బీట్ చేశాడు. 24 గంటలు గడవక ముందే రెండు లక్షలకు పైగా లైకులు పొందిన ఫస్ట్ లుక్ కూడా ఇదే కావడం విశేషం.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా ఫాహద్ ఫాజిల్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.