గోపీచంద్ మలినేనికి విజయ్ ఓకే చెప్పటం వెనక అసలు రీజన్?

Published : Apr 18, 2023, 12:24 PM IST
గోపీచంద్ మలినేనికి  విజయ్ ఓకే చెప్పటం వెనక అసలు రీజన్?

సారాంశం

మాస్ డైరక్టర్ గోపీచంద్ మలినేని ...తమిళ స్టార్ హీరో విజయ్ తో  ఓ తెలుగు-తమిళ సినిమా చేయబోతున్నారు. క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల సక్సెస్ తరువాత చేస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీస్ వారు ప్రొడ్యూస్ చేయనున్నారు.

 రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ తో “వీరసింహారెడ్డి” చేసి బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకున్నారు గోపీచంద్ మలినేని. సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించి బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని ఏ హీరో తో సినిమా చెయ్యాలనే సమస్య వచ్చి పడింది. మన స్టార్ హీరోలుకు కథ చెప్పి ఒప్పించినా ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యే పరిస్దితి లేదు. ఈ క్రమంలో తమిళ స్టార్ విజయ్ ని కలిసి కథ చెప్పటం, సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేయించుకోవటం జరిగిందని వినికిడి.  అయితే తమిళ హీరోలు తెలుగులోకు ఎందుకు వస్తున్నారు...

 ఇప్పుడు తమిళ హీరోలంతా తెలుగు దర్శకులు వంక చూస్తున్నారు. ఆ మాత్రం డైరక్టర్స్ తమిళంలో  లేరని కాదు...మార్కెట్ పెంచుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి అంటే తెలుగు మార్కెట్ లోకి దూకాలి. ఇక్కడ రెమ్యునరేషన్ లు ఎక్కువ కూడాను. మరో ప్రక్క తెలుగు దర్శకులకేమో ...హీరోల సమస్య. అందరు తెలుగు స్టార్ హీరోలు వరస ప్రాజెక్టులు సైన్ చేసి ఉన్నారు. గ్యాప్ లేదు. కాబట్టి వాళ్లు తమిళ హీరోలను ట్రై చేస్తున్నారు.   ఈ క్రమంలో గోపీచంద్ మలినేనికు తమిళ స్టార్ హీరో విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం. కేవలం కథ నచ్చితే చాలదు. రకరకాల ఈక్వేషన్స్ చూసుకుని హీరోలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
 
ఈ సినిమాని తెలుగు మరియు తమిళ్ భాషల్లో.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందట. కొద్దిరోజుల క్రితం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సినిమా చేయడం జరిగింది. “వారసుడు” టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. తెలుగు మరియు తమిళ్ లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. యావరేజ్ సినిమాను కూడా నెక్ట్స్ లెవిల్ కు ప్రమోషన్స్ తో తీసుకెళ్లిన నిర్మాత పద్దతి విజయ్ కు నచ్చి మరో సినిమా తెలుగులో చెయ్యాలని చూస్తూంటే ఈ కథ తన దగ్గరకు వచ్చిందని సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?