కమల్‌ హాసన్‌ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. `ఇండియన్‌ 2` తర్వాత స్టార్ట్ అయ్యేది ఇదే?

Published : Jan 25, 2023, 04:22 PM IST
కమల్‌ హాసన్‌ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. `ఇండియన్‌ 2` తర్వాత స్టార్ట్ అయ్యేది ఇదే?

సారాంశం

`విక్రమ్‌` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని జోష్‌లో ఉన్న కమల్‌ హాసన్‌ వరుసగా కొత్త సినిమాలకు సైన్‌ చేస్తున్నారు. తాజాగా ఆయన మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. వెంటనే షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నారు.

లోకనాయకుడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. `విక్రమ్‌` చిత్రంతో గతేడాది బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయనకు హిట్‌ పడింది. అది కోలీవుడ్‌ కలెక్షన్ల రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతున్నారు కమల్‌. ప్రస్తుతం ఆయన ఆగిపోయిన `ఇండియన్‌ 2` చిత్రాన్ని పట్టాలెక్కించారు. శంకర్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని ఈ ఏడాది రిలీజ్‌ చేయబోతున్నారు. 

ఇదిలా ఉంటే నెక్ట్స్ కమల్‌.. మణిరత్నంతో ఓ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. కెహెచ్‌234గా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీన్ని తన బ్యానర్‌లోనే నిర్మించబోతున్నారు కమల్‌. దీనితోపాటు `విక్రమ్‌ 2` కూడా చేయాల్సి ఉంది. దీనికి కొంచెం టైమ్‌ పడుతుంది. తాజాగా మరో సినిమాకి కమిట్‌ అయ్యారట కమల్‌. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఆల్మోస్ట్ ఈ చిత్రం ఫైనల్‌ అయ్యిందని, తన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై కమల్‌ హాసన్‌ నిర్మించబోతున్నారట. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నట్టు టాక్.

హెచ్‌. వినోద్‌ చిత్రం మార్చిలో ప్రారంభం కాబోతుందని సమాచారం. `ఇండియన్‌ 2` తర్వాత నెక్ట్స్ ఈ మూవీనే కమల్‌ హాసన్‌ చేయబోతున్నట్టు టాక్‌. ఆ తర్వాత మణిరత్నం సినిమా ఉంటుందని తెలుస్తుంది. మణిరత్నం ఇప్పుడు `పీఎస్‌2`లో బిజీగా ఉన్నారు. ఈ సమ్మర్‌కి అది రాబోతుంది. ఆ తర్వాత ఆయన ఫ్రీ అవుతారు. కమల్‌ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించే ఛాన్స్‌ ఉందట. 

ఇదిలా ఉంటే `సథురంగ వెట్టై` చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న వినోద్‌ `ఖాకి` చిత్రంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వరుసగా అజిత్‌తో సినిమాలు చేస్తున్నారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు సినిమాలు చేయడం విశేషం. `నెర్కొండ పార్వై`(పింక్‌ రీమేక్‌), `వలిమై`, `తెగింపు`(తునివు) చిత్రాలు చేశారు. `తెగింపు` మూవీ సంక్రాంతికి విడుదలై భారీ సక్సెస్‌ని అందుకుంది. సినిమాకి నెగటివ్‌ టాక్ వచ్చినా, కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. ఇప్పుడు ఆయన కమల్‌ని డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. 

ఇదిలా ఉంటే `విక్రమ్‌` డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌.. విజయ్‌తో ఆయన 67వ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇమ్మిడియెట్‌గా ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. ఇందులో హీరో విక్రమ్‌ విలన్‌గా కనిపించబోతున్నారట. అంతేకాదు కమల్‌ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌