పూరీని రామ్ కూడా వెయిట్ చేయిస్తున్నాడట!

Published : Oct 16, 2018, 06:16 PM IST
పూరీని రామ్ కూడా వెయిట్ చేయిస్తున్నాడట!

సారాంశం

హీరోలను డిఫరెంట్ గా చూపించడంలో పూరి జగన్నాథ్ స్టైల్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోలను కవర్ చేసిన పూరి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఈ దర్శకుడి పరిస్థితి ఎలా ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

హీరోలను డిఫరెంట్ గా చూపించడంలో పూరి జగన్నాథ్ స్టైల్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోలను కవర్ చేసిన పూరి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఈ దర్శకుడి పరిస్థితి ఎలా ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తనతో సినిమా అంటేనే మొహం చాటేస్తున్నారని ఆయనే చెప్ప్పుకునే పరిస్థితి వచ్చింది. 

యువ కథానాయకులు అందరూ ఒకప్పుడు పూరి జగన్నాథ్ తో ఒక్క సినిమా చేసినా చాలని అనుకునే వారు. కానీ ఇప్పుడు అలా లేదు. చివరగా కొడుకుతో తీసిన మోహబూబా కూడా డిజాస్టర్ అవ్వడంతో అప్పటివరకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న హీరోలు కూడా పూరితో సినిమా కుదరదని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇకపోతే ముందు నుంచి రామ్ తో ఒక సినిమా చేయాలనీ ఈ దర్శకుడు ప్రయత్నం చేస్తున్నాడు. 

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ పూరి సినిమాకు సంబందించిన విషయాన్నీ తెలిపాడు. ఇంకా కథ సెట్ అవ్వలేదని ఆయన చెప్పిన లైన్ సెట్టయితే వెంటనే సినిమా స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. అంటే పూరి రామ్ తో చేయడానికి ఎంతగా ట్రై చేస్తున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిజంగా ఒక స్టార్ డైరెక్టర్ ఇంతలా వెయిట్ చేసే పరిస్థితి వస్తుందని ఎవరు ఉహించి ఉండరు.  

PREV
click me!

Recommended Stories

Spirit First Look అరాచకం.. షర్ట్ లేకుండా ప్రభాస్‌ లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. వంగా మామూలోడు కాదు
Suriya 46 Movie: సూర్య 46కి, గజినీకి సంబంధం ఏంటి? అంచనాలు పెంచేసిన నిర్మాత సమాధానం