'జనగణమన'లో పూరి మార్క్ డైలాగ్!

Published : Feb 28, 2019, 03:04 PM IST
'జనగణమన'లో పూరి మార్క్ డైలాగ్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో 'పోకిరి','బిజినెస్ మెన్' సినిమాలు తీశాడు. ఆ రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో 'పోకిరి','బిజినెస్ మెన్' సినిమాలు తీశాడు. ఆ రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే మహేష్ తో మరో సినిమా చేయాలనుకున్నాడు పూరి.

దానికి 'జనగణమన' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. మహేష్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ కూడా చేశాడు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా ఊసే లేకుండా పోయింది. పూరి మాత్రం ఎప్పటికైనా ఈ సినిమా చేస్తానని అంటున్నాడు.

సినిమా టైటిల్ ని బట్టి దేశభక్తి కథ అని తెలుస్తోంది. ప్రస్తుతం భరత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపధ్యంలో ఈ సినిమాను మరోసారి గుర్తుచేసుకున్నాడు పూరి. 'జనగణమన' సినిమా నుండి పూరి ఒక డైలాగ్ ని తాజాగా తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.

''డచ్ ,ఫ్రెంఛ్ , బ్రిటిష్ .. ఎప్పుడూ ఎవడెవడో ఆక్రమించుకోవడమేనా ? ఆ పని మనమెందుకు చేయడం లేదు ? ఎప్పుడు ఈ ఇండియన్స్ మీద పడిపోతారో అని మిగతా దేశాలు భయపడుతూ చావాలి.. STRENGTH LIES IN ATTACK, NOT IN DEFENCE''.. ఈ డైలాగ్ ని చూసిన నెటిజన్లు పూరి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహేష్ తో తొందరగా సినిమా చేయండి సార్ అంటూ పూరిని కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్