పాక్ నెటిజన్లకు అద్నాన్ సమీ కౌంటర్!

Published : Feb 28, 2019, 02:37 PM IST
పాక్ నెటిజన్లకు అద్నాన్ సమీ కౌంటర్!

సారాంశం

ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ పెట్టిన పోస్ట్ పై పాక్ నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆయన్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ కి అద్నాన్ సమీ ధీటైన సమాధానం చెప్పాడు. 

ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ పెట్టిన పోస్ట్ పై పాక్ నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆయన్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ కి అద్నాన్ సమీ ధీటైన సమాధానం చెప్పాడు. పాకిస్తాన్ లో పుట్టిన ఈ సింగర్.. కొన్నేళ్ల క్రితం భారత పౌరసత్వం తీసుకున్నారు.

ఇటీవల భారత వైమానిక దళం పాకిస్తాం ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసిన నేపధ్యంలో సమీ భారత్ కి మద్దతిస్తూ.. భారత వైమానిక దళం పట్ల ఎంతో గర్వంగా ఉందని, ఉగ్రవాదాన్ని ఆపండి, జై హింద్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.

దాంతో పాకిస్తాన్ నెటిజన్లు అతడిపై మండిపడ్డారు. పాకిస్తాన్ లో పుట్టి.. భారత్ కి మద్దతిస్తున్నావ్.. సిగ్గుగా లేదా అంటూ అద్నాన్ సమీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన తనపై ట్రోలింగ్ చేస్తోన్న వారికి ధీటుగా సమాధానం చెప్పాడు.

''డియర్ పాక్ ట్రోల్స్.. ఇక్కడ మీ ఈగో విషయం కాదు. మీరు శత్రువులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏకిపారేయడం ఇక్కడ విషయం. మీ నీచమైన మెంటాలిటీ పట్ల నవ్వొస్తోంది. మీరు అనే మాటలే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే
Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్