ఎన్టీఆర్ మూవీ ఫ్లాప్ అని స్టార్ డైరెక్టర్ కి ముందే తెలుసు..సేఫ్ అయిపోవడానికి ఏం చేశారంటే, ముఖం మీదే చెబుతూ

By tirumala AN  |  First Published Aug 23, 2024, 9:57 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. సింహాద్రి చిత్రంతో ఎన్టీఆర్ కెరీర్ ఒక్కసారిగా పీక్ స్టేజికి చేరింది. ఇప్పుడు అంతకి మించిన క్రేజ్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు.


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. సింహాద్రి చిత్రంతో ఎన్టీఆర్ కెరీర్ ఒక్కసారిగా పీక్ స్టేజికి చేరింది. ఇప్పుడు అంతకి మించిన క్రేజ్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. సింహాద్రితో ఎంతటి సక్సెస్ అందుకున్నాడో ఆ  తర్వాత తారక్ అదే స్థాయిలో ఫ్లాప్స్ కూడా చూశాడు. 

సింహాద్రి లాంటి రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ ఇమ్మీడియట్ గా చేసిన చిత్రం ఆంధ్రావాలా. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆ చిత్రం హైప్ పెరిగిపోయింది. ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుంచి ఆంధ్రావాలా ఆడియో లాంచ్ కి అభిమానులు తరలి వెళ్లారు. ఎంత అంచనాలతో ఆ చిత్రం రిలీజ్ అయిందో అంత దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. 

Latest Videos

undefined

పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏమాత్రం అంచనాలు అందుకోలేదు. ఈ చిత్రానికి ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్. టాలీవుడ్ లో ఆయన పేరొందిన ఎడిటర్. ఆంధ్రావాలా చిత్ర షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా వర్కౌట్ కాదని పూరి జగన్నాధ్ కి అర్థమైపోయిందట. కానీ ఇతరుల ఒపీనియన్ కూడా తీసుకుంటారు కదా. ఈ క్రమంలో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మార్తాండ్ కె వెంకటేష్ ని పూరి అడిగారట. 

మార్తాండ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. మూవీ ఎలా అనిపించింది అని అడిగితే.. మార్తాండ్ నిర్మొహమాటంగా పూరి ముఖం మీదే తన అభిప్రాయం చెప్పాడు. నాకు సినిమా అసలు నచ్చలేదు. ఎన్టీఆర్ గెటప్ బాగాలేదు. పైగా ఎన్టీఆర్ లాంటి కుర్రాడు అంత పెద్ద పాత్ర చేయడం కూడా సూట్ కాలేదు అని చెప్పేశారట. 

సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఒపీనియన్ ఏమో నెగిటివ్ గా వస్తోంది. ఎలాగైనా సినిమాని సేఫ్ చేయడానికి పూరి ప్రయత్నించారు. ఒక కామెడీ ట్రాక్ క్రియేట్ చేసి సెకండ్ హాఫ్ లో పెడితే మూవీ సేఫ్ అవుతుందా అని పూరి అడిగారట. దీనికి మార్తాండ్ మీరు ఏం చేసుకున్నా ఈ సినిమా వర్కౌట్ కాదు అని తేల్చేశారు. 

తాను డైరెక్టర్ల దగ్గర, నిర్మాతల దగ్గర స్ట్రైట్ గా మాట్లాడతా అని మార్తాండ్ అన్నారు. అల్లు అరవింద్, రామానాయుడు లాంటి అగ్ర నిర్మాతలు తన ఒపీనియన్ ని చాలా సార్లు అభినందించినట్లు తెలిపారు. 

click me!