త్వరలో రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉంటుందో స్వయంగా రామ్ చరణ్ లీక్ చేశాడు. అదేమిటో చూద్దాం.
ఆర్ ఆర్ ఆర్ తో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నాడు రామ్ చరణ్. ఎన్టీఆర్-చరణ్ ల ఈ మల్టీస్టారర్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కలెక్షన్స్ కి మించి ఈ సినిమా ఆస్కార్ అందుకోవడం మరొక విశేషం. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ గ్లోబల్ సినిమా వేదికలపై సత్తా చాటింది. ఆర్ ఆర్ ఆర్ తో రామ్ చరణ్ ఫేమ్ ఇండియా వైడ్ పాకింది. పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరాడు. ఆర్ ఆర్ ఆర్ అనంతరం చేసిన ఆచార్య మాత్రం నిరాశపరిచింది.
చిరంజీవి ప్రధాన పాత్ర చేసిన ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశాడని చెప్పొచ్చు. దర్శకుడు కొరటాల ఆచార్య చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆచార్య డిజాస్టర్ కాగా... రామ్ చరణ్ నుండి సాలిడ్ బ్లాక్ బస్టర్ అభిమానులు ఆశిస్తున్నారు. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్సీ 16 వర్కింగ్ టైటిల్ గా ఉన్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుంది.
రామ్ చరణ్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో మూవీ సాగనుంది. రామ్ చరణ్ పల్లెటూరి కుర్రాడిగా అలరిస్తాడని సమాచారం. ఇది స్పోర్ట్స్ డ్రామా అనే పుకారు కూడా ఉంది. కాగా ఆర్సీ 16లో తన పాత్రపై రామ్ చరణ్ స్వయంగా లీక్ ఇచ్చాడు.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవిని యాంకర్ ఇంటర్వ్యూ చేసింది. మీకు కామెడీ-థ్రిల్లర్స్ లో ఏది ఇష్టం అంటే... కామెడీ, ఎందుకంటే కామెడీ మూవీ ఎప్పుడూ చేయలేదు అన్నారు. భవిష్యత్ లో మీ నుండి కామెడీ రోల్ ఆశించ వచ్చా? అని అడగ్గా... ఖచ్చితంగా, దర్శకుడు బుచ్చిబాబుతో చేస్తున్న మూవీ అలానే ఉంటుంది, అని చరణ్ అన్నారు.
కాబట్టి ఆర్సీ 16లో రామ్ చరణ్ పాత్రలో కామెడీ మోతాదు ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. మాస్ ఇమేజ్ కలిగిన రామ్ చరణ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ చేస్తాడని చెప్పలేం. కాబట్టి ఆర్సీ 16లో రామ్ చరణ్ గత చిత్రాలకు భిన్నంగా మరింత ఫన్ అందించనున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించిన రంగస్థలం మూవీలో సైతం కామెడీ యాంగిల్ ఉంది. చెవిటివాడిగా రామ్ చరణ్ కష్టాలు, హావభావాలు నవ్వులు పూయిస్తాయి..
gives a hint that will have comedy too through his role!!
pic.twitter.com/ZUNAbRX2kN