
యూట్యూబ్ వేదికగా పూరీ జగన్నాథ్(puri jagannadh) ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్న విషయం తెలిసిందే. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన అభిప్రాయాలు చెపుతూ వస్తున్న డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ.. ఈసారి కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు.
టాలీవుడ్ లో పూరీ జగన్నాథ్(puri jagannadh) ది ప్రత్యేకమైన మార్క్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి పేరున్న పూరీ.. తనదైన శైలిలో చాలా విషయాలను పూరీ మ్యూజింగ్స్ పేరుతో అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ.. వస్తున్నారు. వివాదాలు లేకుండా తాను చెప్పాలనుకునేది సూటిగా చెపుతూ వస్తున్నాడు పూరీ. అంతే కాదు నలుగురు ఆలోచించే విధంగా అర్ధవంతంగా మాట్లాడుతూ.. చాల మందికి తెలియని విషయాలు.. తెలియజెపుతున్నారు పూరీ.
రీసెంట్ గా పూరీ జగన్నాథ్(puri jagannadh) తన మ్యూజింగ్స్ లో పెట్టిన ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఫేమస్ బాబ్ మార్లే పాడిన పాటలో మీనింగ్ ను వివరిస్తూ..ఈ పాటను అందరితో పాటు తాను కూడా అపార్థం చేసుకున్నానన్నారు. అసలు అర్ధం వివరంగా చెప్పి.. చాలా మందికళ్ళు తెరిపించాడు పూరీ. అయితే ఆడవాళ్ళు లేకుంటే ఏడుపులు ఉండవనే భావన వచ్చే విధంగా బాబ్ మార్లే పాట ఉందని చాలా మంది అపార్దం చేసుకుంటున్నారు.
కాని దాని అర్ధం అది కాదు అన్నారు పూరి(puri jagannadh). బాబ్ మార్లే పాటలో నో విమెన్స్ నో క్రై అనే పాట లిరిక్ వినిపిస్తుంది. కాని అది నిజం కాదు.. జాగ్రత్తగా వింటే అందులో నో విమెన్ న క్రై అని తెలుస్తుంది. అంటే ఆడవాళ్ళు లేకుంటే.. ఏడుపు లేదు అని కాదు.. ఆడవాళ్లు ఎప్పుడూ ఏడవకూడదు అని అర్ధం అంటూ.. వివరంగా చెప్పారు పూరి.
ఓ చల్లని సాయంత్ర పటాయ్ బీచ్ ఒడ్డు రెస్టారెంట్లో కూర్చోని ఉన్నప్పుడు ఒక వ్యక్తి బాబ్ మార్లే పాటు పాడుతున్నాడు. ఆ పాటలు అక్కడివారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాని రెండు పాటల తరువాత అతను నో విమెన్ నో క్రై పాట పాడటం స్టార్ట్ చేశాడు. ఆ పర్టిక్యూలర్ లైన్ రాగానే మగాళ్ళంతా ఫుల్ జోష్ తో.. వంతపాడటం స్టార్ట్ చేశారు. అక్కడి ఆడవాళ్లు మాత్రం చిన్నబుచ్చుకున్నారు. ఇలానే గోవాలోను, న్యూజిలాండ్ లోను జరిగింది. అంటూ.. ఆపాటకు అర్ధం వివరించే ప్రయత్నం చేశారు పూరీ. అయితే నిజానికి ఈ పాట రాసింది బాబ్ మార్లే కాదు.. విన్సెంట్ ఫోర్డ్. విన్సెంట్ రాసిన ఈ లైన్ ను తీసుకుని బాబ్ మారే పాటను పాడారట.
ప్రస్తుం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో లైగర్(Liger) మూవీ హడావిడిలో ఉన్నాడు పూరీ జగన్నాథ్. అగస్ట్ 25న ఈమూవీ రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అనన్య పాండే(Ananya Pandye) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ద్వారా పూరీ జగన్నాథ్ పాన్ ఇండియాకు వెళ్ళబోతున్నాడు. ఈసినిమా తరువాత బాలయ్యతో పూరీ జగన్ సినిమా ఉండే అవకాశం ఉంది.