అక్షయ్‌ కుమార్‌ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం..

Published : Jan 16, 2022, 07:50 AM IST
అక్షయ్‌ కుమార్‌ సినిమా  సెట్‌లో అగ్నిప్రమాదం..

సారాంశం

 సినిమా షూటింగ్‌ జరుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట. అక్షయ్‌ కుమార్‌,  కృతి సనన్‌లపై కొన్ని  సీన్లు తెరకెకిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని బాలీవుడ్‌ మీడియా  కథనం ద్వారా తెలుస్తుంది. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌(Akshay Kumer) నటిస్తున్న `బచ్చన్‌ పాండే`(Bachchan Pandey) సినిమా షూటింగ్‌ సెట్‌లో అగ్ని  ప్రమాదం చోటు చేసుకుంది.  సినిమా షూటింగ్‌ జరుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట. అక్షయ్‌ కుమార్‌,  కృతి సనన్‌లపై కొన్ని  సీన్లు తెరకెకిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని బాలీవుడ్‌ మీడియా  కథనం ద్వారా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రాణహానీ లేదని, ఎవరికీ ఏం కాలేదని, అంతా  సురక్షితంగానే ఉన్నారట. 

ప్రస్తుతం బాలీవుడ్‌లో Akshay Kumer నటిస్తున్న చిత్రాల్లో `బచ్చన్‌ పాండే` ఒకటి. ఆయనకు  జోడీగా కృతి  సనన్‌,  జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫర్హద్‌ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తమిళంలో వచ్చిన `జిగార్తాండ`కి రీమేక్‌ అని  తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని చాలా రోజులవుతుంది. మార్చిలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే  కరోనా కారణంగా షూటింగ్‌లు అన్ని నిలిచిపోతున్నాయి. సినిమా విడుదలలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమాలో కొంత ప్యాచ్‌ వర్క్ మిగిలిందట. దాన్ని కంప్లీట్‌ చేయాలని భావించారు. 

అందులో భాగంగా సెట్‌లో అక్షయ్‌,  కృతిసనన్‌లపై చిత్రీకరణ జరుపుతున్నారు. అనుకోకుండా సెట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన  యూనిట్‌ మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు  కాలేదని తెలుస్తుంది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు షూటింగ్‌ని  పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఇదిలా  ఉంటే అక్షయ్‌ కుమార్‌ ఏడాది మూడు నాలుగు  సినిమాలు  రిలీజ్‌ చేస్తూ బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. కరోనా వల్ల ఆయన సినిమాలకు బ్రేక్‌ పడ్డాయని చెప్పొచ్చు. 

కానీ అంతకు ముందు అక్షయ్‌ కుమార్‌ సినిమాల నుంచి ఏడాది వెయ్యి కోట్ల బిజినెస్‌ జరుగుతుంది. ప్రతి సినిమా హిట్‌ అనే టాక్‌ తెచ్చుకునేది. అంతేకాదు ప్రతి సినిమా రెండు వందల నుంచి మూడు వందల కోట్లు వసూలు చేసేవి. ఇలా ఓ  రకంగా అక్షయ్‌ కుమార్‌ని మినీ ఇండస్ట్రీగా పిలుచుకునే  వారు. కరోనా  వల్ల ఆయన  సినిమాలన్నీ  ఆగిపోయాయి.  ఇప్పుడు రిలీజ్‌కి రెడీగా  ఉన్నాయి. వాటిలో `పృథ్వీరాజ్‌`, `రక్షాబంధన్‌`,  `మిషన్‌  సిండ్రెల్లా`, `బచ్చన్‌ పాండే` చిత్రాలున్నాయి. 

వీటితోపాటు అక్షయ్‌ `రామ్‌సేతు`, `ఓమైగాడ్‌2` చిత్రాలు చేస్తున్నారు. రీసెంట్‌గా `సెల్ఫీ` అనే సినిమాకి కమిట్‌ అయ్యారు. రాజ్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను అరున భాటియా, య‌శ్ జోహార్‌, సుప్రియ మీన‌న్‌, క‌ర‌ణ్ జోహార్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, అపూర్వ మెహ‌తా, లిస్టిన్ స్టెఫెన్ నిర్మిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి