Evam Jagath: రూపాయికే సినిమా టికెట్.. ఎక్కడా.. ఎవరు.. ఎందుకిస్తున్నారు..?

By Mahesh JujjuriFirst Published Jan 15, 2022, 8:55 PM IST
Highlights

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హాయిగా సినిమా చూడాలంటే ఖచ్చితంగా 200 పైనే రేటు పెట్టి సినిమా టికెట్ కొనాలి. కాని ఓ మూవీ డైరెక్టర్ మాత్రం తన సినిమా టికెట్ రేటు ఒక్క రూపాయే అంటున్నారు. ఇంతకీ ఎవరువారు...?

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హాయిగా సినిమా చూడాలంటే ఖచ్చితంగా 200 పైనే రేటు పెట్టి సినిమా టికెట్ కొనాలి. కాని ఓ మూవీ డైరెక్టర్ మాత్రం తన సినిమా టికెట్ రేటు ఒక్క రూపాయే అంటున్నారు. ఇంతకీ ఎవరువారు...?

ప్రస్తుతం ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ నడుస్తుంది. సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలి అన్న కాన్సెప్ట్ తో ఏపీలో టికెట్ రేట్లను తన కంట్రోల్ లోకి తీసుకుని.. అక్కడి ప్రభుత్వం.. టికెట్ రేట్లను భారీగా తగ్గించింది. సాధారణంగా థియేటర్ లో సినిమా చూడాలి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 200 పైనే పెట్టాలి. కాని ఓ దర్శకుడు మాత్రం రూపాయికే  తన సినిమా చూపిస్తా అంటున్నాడు. వందలు పెట్టకుండా తన సినిమాను రూపాయికే ఆస్వాదించవచ్చున్నాడు.

మనం ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో సినిమా చూడాలి అన్నా.. నెలకు వందపైనే సమర్పించుకోవల్సిందే. అటువంటిది ఏవమ్ జగత్ అనే సినిమా తీసిన దర్శకుడు తన సినిమాకు రూపాయి టికెట్ ధరగా నిర్ణయించాడు. దీనికి కారణం ఏంటీ అంటే.. ఆ సినిమా రైతుల కోసం తీసిన సినిమా. వ్యావసాయం నేపథ్యంలో దినేష్ నర్రా అనే కుర్ర దర్శకుడు తెరకెక్కించిన మూవీ ఏవమ్ జగత్.

కిరణ్ గేయ, ప్రకృతి వనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా లాంటి తారలు పాత్ర ధారులుగా.. మార్చ్ మూవీస్ ప్రొడక్షన్స్ పతాకంపై.. ముణిరత్నం నాయుడు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాను ఒక్క రూపాయి వెచ్చించి.. ఆన్ లైన్ లో సినిమా చూసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు  మూవీ టీమ్.

సంక్రాంతి కానుకుగా ఈ రైతుల సినిమా ఏవమ్ జగత్ రిలీజ్ కాబోతోంది. 16న సాయంత్రం 6 గంటలకు ఏవమ్ జగత్ డాట్ కామ్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు టీమ్. లేదంటే క్యూ ఆర్ కోడ్ ను  స్కాన్ చేసి అయినా..సైట్ ను డైరెక్ట్ గా ఓపెన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. సైట్ లోకి వెళ్ళి రూపాయి కడితే.. సినిమా లింక్ బయటకు వస్తుంది. అప్పుడు సినిమాను చూడవచ్చు.

సేంద్రీయ వ్యవసాయం.. పల్లె వాతావరణ గురించి ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో రసాయనాలు వాడుతూ.. కృత్రిమ వ్యవసాయం చేస్తే.. భవిషత్త్ తరాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోంటారు.. మనకు కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది సినిమా కాన్సెప్ట్. వీటితో పాటు కుటుంబ అనుబంధాలను కూడా అందంగా చూపించారీ సినిమాలో.  

 

click me!