అడ్డంగా బుక్కయిన పూరీ.. క్యూలో ఛార్మి..ముగిసిన విచారణ

First Published Jul 19, 2017, 9:32 PM IST
Highlights
  • ఉదయం 10.45 నుంచి  రాత్రి 9.30 వరకు పూరీ విచారణ
  • ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది
  • బాగా అలసిపోయి కనిపించిన పూరీ
  • మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన పూరీ

డ్రగ్స్ స్కాండల్ కేసులో విచారణ చేపట్టిన సిట్ అధికారులు తొలిరోజు దర్శకుడు పూరీ జగన్నాథ్ ను పదిగంటలకు పైగా విచారించారు. ఈ విచారణ సుదీర్ఘంగా సాగటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే విచారణాధికారులు మాత్రం పూరీని అన్ని కోణాల్లో ప్రశ్నలు సంధించి నిజాలు నిగ్గు తేల్చినట్లు తెలుస్తోంది. మొదటగా డ్రగ్స్ రాకెట్ లో ప్రధాన సూత్రధారి కెల్విన్ తో పూరీకున్న సంబంధాలపై సిట్ ఆరా తీసింది.

అయితే.. కెల్విన్ తనకు తెలియదని పూరీ తొలుత బుకాయించాడు. కానీ లంచ్ బ్రేక్ తర్వాత ఆధారాలతో సహా పూరీ ముందుకొచ్చిన సిట్ అధికారుల ప్రశ్నలకు పూరీ వద్ద చాలాసేపటి దాకా సమాధానం లభించలేదు. చివరకు మరిన్ని ఆధారాలు బయట పెట్టడంతో పూరీ నోట మాట రాలేదు. నిజం చెప్పక తప్పలేదు.

ఛార్మి హీరోయిన్ గా నటించిన జ్యోతి లక్ష్మి చిత్రం ఆడియో వేడుక సందర్భంగా వేదికపై.. కెల్విన్ సహా పలువురు డ్రగ్స్ కేసు నిందితులు హంగామా చేసిన ఫోటోలు చూపించడంతో పూరీ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఇక తప్పని పరిస్థితుల్లో పూరీకి నిజం చెప్పాల్సిన అవసరం రాక తప్పలేదు.

ఆధారాలు చూపించడంతో.. పోలీసులకు ఒక్కొక్కటిగా వివరాలు అందించాడు పూరీ. తొలుత కెల్విన్ ఎవరో తనకు తెలియదన్న పూరీ అదే నోటితో ఆధారాలు చూపిన తర్వాత కెల్విన్ తనకు ఈవెంట్ మేనేజర్ గా చాలాకాలంగా తెలుసని నిజం చెప్పాడు.

ఇక విచారణలో భాగంగా తొలుత దాదాపు గంటపాటు తన సినీ ప్రస్థానం గురించే పూరీ వివరించినట్లు సమాచారం. సిట్ అధికారులు కూడా పూరీ చెప్పిన సంగతులన్నీ సావధానంగా విని.. తర్వాత అసలు విషయాలు కక్కించారు. కెల్విన్ తో పూరీకి బ్యాంకు లావాదేవీలున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.

ఇక సుదీర్ఘ విచారణ తర్వాత పూరీ బ్లడ్ శాంపిల్ సేకరించేందుకు ఉస్మానియా వైద్యులను పిలిపించిన సిట్ అధికారులు పూరీ బ్లడ్ సేకరించి పరీక్షకు పంపారు.

 

ముగిసిన పూరీ జగన్ విచారణ

 

 

పూరీని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన సిట్ అధికారులు

మొదట తనకు కెల్విన్ ఎవరో తెలియదని చెప్పిన పూరీ

చివరి అస్త్రంగా జ్యోతి లక్ష్మి ఆడియో వేడుక ఫోటోలను చూపిన అధికారులు

రేపు సిట్ విచారణకు శ్యామ్ కె నాయుడు

కెల్విన్ ఎకౌంట్ కు పూరీ డబ్బులు

పూరీని 10 గంటలు విచారించిన సిట్

పూరీ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న ఉస్మానియా వైద్యులు

రాత్రి 9.30 గంటలకు సిట్ విచారణ నుంచి బయటికొచ్చిన పూరీ

click me!