పూరీ, ఛార్మిలను పట్టించిన జ్యోతి లక్ష్మి సినిమా ఆడియో వేడుక

Published : Jul 19, 2017, 05:34 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పూరీ, ఛార్మిలను పట్టించిన జ్యోతి లక్ష్మి సినిమా ఆడియో వేడుక

సారాంశం

డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్ విచారణ పూరీ, చార్మీల జ్యోతి లక్ష్మి చిత్ర ఆడియో వేడుకలో కెల్విన్ కెల్విన్ తెలుసు కానీ డ్రగ్స్ స్మగ్లర్ అని తెలియదన్న పూరీ

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నోటీసులు అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణ సాయంత్రంలోగా ముగుస్తుందనుకుంటే.. విచారణ మాత్రం సాయంత్రం కూడా కోనసాగుతూనే వుంది. డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి కెల్విన్ తో పూరీ జగన్నాథ్ కు సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఎక్సైజ్ పోలీసులు ఆ దిశగా పూరీని వీలైనన్ని ప్రశ్నలు సంధించి ఇరుకున పెట్టినట్లు తెలుస్తోంది.

అసలు కెల్విన్ తో ఎలా పరిచయమైంది.. అంతే కాదు మీరు డ్రగ్స్ దందా చేస్తున్నారా.. లేక కేవలం వినియోగిస్తున్నారా అనే ప్రశ్న కూడా సంధించారు. ఇక ఈ ప్రశ్నల సంగతి ఒకెత్తయితే.. పూరీకి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా కెల్విన్ బ్యాంక్ ఎకౌంట్ తో లింక్ అయి వున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. బ్యాంకాక్ తరచుగా ఎందుకు వెళ్తారని పూరీ జగన్నాథ్ ను కూడా సిట్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే కేవలం సినిమాల కోసమే వెళ్తాను తప్ప మరే పని కోసం కాదని పూరీ చెప్పినట్లు సమాచారం.

ఇక తనకు కేవలం పబ్స్ కు వెళ్లే అలవాటుంది తప్ప డ్రగ్స్ అలవాటు లేదని పూరీ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తన సినిమాల్లో ఎక్కువ పబ్ సీన్స్ ఉంటాయి కనుకనే పబ్స్ లో ఎక్కువ టత్ లో వుంటానని పూరీ చెప్పినట్లు సమాచారం.

మరోవైపు పూరీ డ్రగ్స్ దందాలో భాగంగానే తరచూ బ్యాంకాక్ వెళ్తారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఛార్మి హీరోయిన్ గా పూరీ దర్శకత్వం  వహించిన జ్యోతి లక్ష్మి సినిమా ఆడియో వేడుకలో కెల్విన్ సహా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుల్లో పలువురు హాజరయినట్లు పోలీసులు గుర్తించారు. కెల్విన్ దగ్గర స్వాధీనం చేసుకున్న కొన్ని జ్యోతి లక్ష్మి చిత్ర ఆడియో వేడుక ఫోటోల ఆధారంగానే పూరీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. అంతేకాక దీనికి సంబంధించిన వీడియోల్లో కూడా కెల్విన్ సహా పట్టుబడ్డ నిందితుల్లో కొందరు వున్నట్లు సిట్ గుర్తించింది.

 

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు