పూరీని కట్ చేసిన బాలకృష్ణ

Published : Sep 09, 2017, 10:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
పూరీని కట్ చేసిన బాలకృష్ణ

సారాంశం

పూరీ దర్శకత్వంలో వచ్చిన బాలకృష్ణ పైసావసూల్ ఫ్లాప్ టాక్ వసూళ్లు సాధించడంలో బోల్తా పడ్డ పైసా వసూల్ పూరీతో మరో సినిమా ఆలోచన విరమించుకున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరీ దర్శకత్వంలో రిలీజైన పైసా వసూల్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో బాలయ్య అభిమానులు పూరీపై తెగ గుర్రుగా వున్నారు. మరోవైపు బాలయ్య మాత్రం పూరీతో మరో సినిమా ఎనౌన్స్ చేసి వున్నాడు. కానీ అభిమానులు ఖరాఖండిగా పూరీతో సినిమా మళ్లీ వద్దని చెప్పడంతో బాలయ్య నిర్ణయం వెనక్కి తీసుకున్నాడని తెలుస్తోంది.

 

అయితే పూరీతో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు సిద్ధంగా వున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ పూరీ నెక్స్ట్ ఎవరితో.. అనే అంశంపై తెగ చర్చ జరుగుతోంది. ఇషాన్, బాలకృష్ణ, ఆకాష్, రవితేజ, చిరంజీవి, మహేష్, వెంకటేశ్... ఇలా ఏకంగా ఏడుగురు హీరోల పేర్లు పూరి లిస్ట్ లో ఉన్నాయి. వీళ్లలో ఎంతమంది ఈ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయాన్ని పక్కనపెడితే ప్రస్తుతం పూరి చుట్టూ అల్లుకున్న కథల్లో మాత్రం ఈ హీరోలంతా వున్నారు. అయితే ముందే కొడుకు ఆకాష్ ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని ప్రకటించాడు పూరి. అక్టోబర్ నుంచే ఈ సినిమా మొదలవుతుందని కూడా తెలిపాడు.

 

ఇక ఆతర్వాత పూరి లిస్ట్ లో మహేష్, రవితేజ పేర్లు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. మహేష్ సినిమాకు జనగణమన అనే టైటిల్ కూడా పెట్టేశాడు పూరి. అటు రవితేజ కోసం మరో మాస్ మసాలా స్టోరీ సిద్ధంచేశానని కూడా ప్రకటించాడు. ఈ రెండు సినిమాల్లో రవితేజ సినిమా ఎప్పుడైనా ఓకే అవ్వొచ్చు. ఎటొచ్చి మహేష్ తో చేయాల్సిన సినిమానే డౌట్.

 

అటు వెంకటేశ్, చిరంజీవి పేర్లు కూడా చెబుతున్నాడు ఈ డైరక్టర్. చిరంజీవితో ఎప్పటికైనా ఓ సినిమా చేస్తానని, 3నెలల కిందట మెగాస్టార్ కు మరో స్టోరీలైన్ కూడా వినిపించానని ప్రకటించాడు. అటు వెంకటేష్ కూడా పూరితో ఓ సినిమా చేస్తానని, ఎప్పుడు చేస్తానో చెప్పలేనని అంటున్నాడు.

 

వీళ్లతో పాటు ‘రోగ్’ హీరో ఇషాన్ కు ఇంకో మూవీ బాకీ ఉన్నాడు ఈ దర్శకుడు. రోగ్ సినిమా టైమ్ లోనే కుదిరిన 2 సినిమాల ఒప్పందం ఇది. ఇలా పూరి ఖాతాలో చాలామంది హీరోలు ఉన్నారు. ప్రస్తుతం వరుస ఫ్లాపులిస్తున్న ఈ దర్శకుడితో వీళ్లలో ఎంతమంది సెట్స్ పైకి వెళ్తారో.. మళ్లీ పూరీ ఎప్పుడు బ్లాక్ బస్టర్ కొడతాడో మరి.

PREV
click me!

Recommended Stories

2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?
సమంత, అఖిల్ అక్కినేనితో పాటు 2025లో పెళ్లి చేసుకున్న 10 జంటలు ఎవరో తెలుసా?