సౌందర్యతో ఎఫైర్ ఉన్న మాట వాస్తవమే: జగపతిబాబు

Published : Apr 01, 2017, 10:46 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
సౌందర్యతో ఎఫైర్ ఉన్న మాట వాస్తవమే: జగపతిబాబు

సారాంశం

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఎఫైర్ పై పెదవి విప్పిన జగపతిబాబు సౌందర్యతో తనకు ఎఫైర్ ఉందని స్పష్టం చేసిన జగపతిబాబు అయితే.. అది అంతా అనుకుంటున్న సెక్స్ రిలేషన్ షిప్ కాదన్న జగపతి

తెలుగు సినీ చరిత్రలో నటి సౌందర్యది తెరగని ముద్ర. మహానటీమణిగా ఆమెకున్న అమూల్యమైన స్థానాన్ని.. ఆమె గతించి ఇన్నేళ్లయినా ఇప్పటి వరకూ ఎవరూ భర్తీ చేయలేకపోయారు. అయితే హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోయిన ఆ హీరోయిన్ సౌందర్యతో తనకున్న ఎఫైర్ గురించి ఇటీవల హీరో జగపతిబాబు చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

 

జగపతిబాబు కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో కొందరు హీరోయిన్లతో ఆయనకు అక్రమ సంబంధం అంటగట్టింది మీడియా. అప్పట్లో ఆ రూమర్లను ఆయన ఖండించింది కూడా లేదు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఓ ఇంటర్వ్యూలో సౌందర్యతో ఎఫైర్ ఆరోపణలపై స్పందించాడు జగపతిబాబు. సౌందర్యతో తనకు ఎఫైర్ ఉన్న మాట వాస్తవమే.. కానీ అది జనాలు అనుకునేది కాదని జగపతిబాబు స్పష్టం చేశాడు.



తాను మహిళల్ని ప్రేమిస్తానని.. అందులో సందేహం లేదని.. ఐతే తాను ఎప్పుడూ దొడ్డిదారిలో వెళ్లనని జగపతి అన్నాడు. మహిళలు కూడా తనను అభిమానిస్తారని.. ప్రేమిస్తారని.. సౌందర్యతో తనకు ఎఫైర్ లేదంటే జనాలు నమ్మరని జగపతి అన్నాడు. ఆమె నిజానికి తనకు మంచి స్నేహితురాలని.. విమాన ప్రమాదంలో ఆమెతో పాటే చనిపోయిన తన సోదరుడు అమర్ కూడా మంచి మిత్రుడని జగపతి అన్నాడు. తాను అప్పట్లో సౌందర్య కుటుంబంలో ఒక సభ్యుడిలా ఉండేవాడిననని.. వాళ్లింట్లో ఏ వేడుక జరిగినా తనకు ఆహ్వానం అందేదని జగపతి తెలిపాడు. ఎఫైర్ అంటే సెక్స్ రిలేషన్ మాత్రమే కాదని.. అలా ఆలోచించే వాళ్లు పర్వర్ట్స్ అని అన్నాడు.



సౌందర్యతో ఎఫైర్ ఉందంటే తనకది క్రెడిటే తప్ప.. మైనస్ కాదని.. ఆమెది హోమ్లీ మనస్తత్వం అని.. ఆమె జనాలు సినిమా హీరోయిన్ల గురించి అనుకునే రకం కాదని జగపతి చెప్పాడు. ఐతే ఇప్పుడు సౌందర్యతో ఎఫైర్ గురించి జగపతి ఎందుకు ఇంత వివరంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థంకాదు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్