
రామ్ పోతినేని(Ram pothineni) హీరోగా, పూరి జగన్నాధ్(Puri jagannadh) కాంబోలో వచ్చిన మాస్ మసాలా మూవీ ఇష్మార్ట్ శంకర్(Ismart shankar) ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. 2019లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డ్ లు క్రియేట్ చేసింది. రామ్ , పూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయటంతో ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి.
ఇస్మార్ట్ శంకర్ సినిమాను సీక్వెల్ గా "డబల్ ఇస్మార్ట్(Double ismart)" సీన్ సినిమాను అనౌన్స్ చేయటంతో అంతటా క్రేజ్ క్రియేట్ అయ్యిపోయింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను(Boyapati srinu)తో స్కంద(Skanda) సినిమా చేస్తున్న రామ్.. ఈ సినిమా కంప్లీట్ అవగానే "డబల్ ఇస్మార్ట్" షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమాకు సంబందించిన ఓ అంశం బయిటకు వచ్చి ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. అదేమిటంటే... ఈ సినిమా హిందీ రైట్స్ నిమిత్తం పూరి డిమాండ్ చేస్తున్న మొత్తం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు #DoubleiSmart చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ కు ఇరవై కోట్లు డిమాండ్ చేస్తున్నారు పూరి. అయితే పెద్ద మొత్తంలా కనిపించినా యాక్షన్ సినిమా కాబట్టి ఖచ్చితంగా పే ఆఫ్ అవుతుందంటున్నారు. దానికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో నటించటం కలిసి వచ్చే అంశం. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఏడు కోట్ల రూపాయలు హిందీ డబ్బింగ్ రైట్స్ కు వచ్చింది. ఇండియా మొత్తం బాగా వెళ్లింది. అయితే నాని దసరా, విశ్వక్సేన్ దాస్ కా దమ్కీ చిత్రాలు సైతం నార్త్ ఇండియా మార్కెట్ లో వర్కవుట్ కాలేదు. దాంతో ఇంత రేటా అని నెగోషియేషన్స్ అడుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక బ్లాక్ బస్టర్ సినిమాను సీక్వెల్ గా వస్తున్న "డబల్ ఇస్మార్ట్" పూరి అండ్ రామ్ కు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది తెలియాలంటే 2024 మార్చ్ 8వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన పూరి ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్స్ ఎవరు అనే దాని పై క్లారిటీ రావాల్సి ఉంది.
.