హాట్ టాపిక్: ‘సలార్‌’డిలే వెనక మూడు సెట్స్?

Published : Sep 04, 2023, 04:40 PM IST
 హాట్ టాపిక్: ‘సలార్‌’డిలే వెనక మూడు సెట్స్?

సారాంశం

ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) ఎంతో శ్రద్దగా తెరకెక్కిస్తున్నారని, ఎక్కడా రాజీ పడడంలేదని సమాచారం. బెస్ట్‌ అవుట్‌పుట్‌ను అందివ్వడం కోసమే సినిమాను వాయిదా వేయనున్నారని బాక్సాఫీస్‌ వద్ద టాక్‌ వినిపిస్తుంది.

భారీ స్థాయిలో ఎక్సపెక్టేషన్స్ పెంచి... విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలా చేసిన  సినిమాల్లో ‘సలార్‌’ ఒకటి. పాన్‌ ఇండియా సెన్సేషన్  ప్రభాస్‌ హీరోగా నటించడం...‘కె.జి.ఎఫ్‌’ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించడం తో ఈ సినిమా మీద అందరి దృష్టీ పడింది. సెప్టెంబరు 28న విడుదల అని చిత్రటీమ్ ఇదివరకే కన్ఫర్మ్ చేయడంతో... అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ఏమిటనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రిలీజ్ వాయిదాకు కారణం మూడు సెట్స్ అంటున్నారు. ఈ సినిమా దర్శకుడు ముంబైకు చెందిన విజువల్ ఎఫెక్ట్ టీమ్ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. డైరక్టర్ ప్రశాంత్ నీల్ ... ముంబైకు చెందిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ టీమ్ లను మూడు ఫిక్షనల్ లావిష్ సిటీ సెట్ లను క్రియేట్ చేయమని చెప్పారట. ఈ మేరకు గత కొంతకాలంగా వాళ్లు పనిచేసి తమ వర్క్ ని రీసెంట్ గా ప్రశాంత్ నీల్ కు ప్రెజెంట్ చేసారట. అది చూసి ప్రశాంత్ నీల్ తాను అనుకున్నది ఏమిటి వాళ్లు చూపెడుతున్న దానికి ఎక్కడా మ్యాచ్ కాలేదని మండిపడ్డారట. మరో రెండు మూడు రిఫరెన్స్ లు ఇచ్చి మరోసారి ప్యాచ్ వర్క్ లతో ఆ మూడు సిటీలను రీక్రియేట్ చేయమని పురమాయించారట. భారీ బడ్జెట్ ని ఈ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం నిర్మాతలు ఖర్చు పెట్టినా దర్శకుడు అనుకున్న స్దాయిలో అవుట్ ఫుట్ ఇవ్వలేదని ,కానీ ఇప్పటికిప్పుడు టీమ్ ని మార్చితే ఇబ్బంది అవుతుందని అదే టీమ్ తో కొనసాగిస్తున్నట్లు సమాచారం. 

విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న చిత్రం కావడంతో... అన్ని జాగ్రత్తలతో ముందుకు వెళ్లాల్సి వస్తోందని సమాచారం. అందుకే మరోసారి రిలీజ్ డేట్ ని మార్చనుంది చిత్ర టీమ్ . సెప్టెంబరు నెల మొదలైనా ప్రమోషన్స్ ఊపందుకోకపోవడంతో విడుదలపై కొన్నాళ్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి నెక్ట్స్  విడుదల ఎప్పుడన్నది ఇప్పుడు ఇంట్స్టింగ్ టాపిక్ గా గా మారింది.  మరోవైపు ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఎ.డి’ కూడా విడుదల కోసం రెడీ అవుతోంది. 

మరోవైపు ఓవర్ సీస్ లో ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా.. రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఇప్పటికే 5లక్షలకు పైగా టికెట్స్‌ కొనుగోలు చేసినట్లు అక్కడి డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అధికారికంగా తెలిపింది. అయితే, వాయిదా వార్త వచ్చిన నేపథ్యంలో టికెట్‌ బుక్‌ చేసుకున్న వారి డబ్బులను కూడా వెనక్కి ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇక రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రం లో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం
Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం