పూరి ఆంథమ్ అదిరింది.. మాస్ స్టెప్పులతో కేక పెట్టిస్తున్న రష్మీ, నందు

By telugu teamFirst Published Sep 28, 2021, 12:15 PM IST
Highlights

నటుడు నందు టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నటుడిగా, హీరోగా రాణిస్తూనే.. క్రికెట్ యాంకర్ గా కూడా చేస్తున్నాడు. ఇక యాంకర్ గా రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

నటుడు నందు టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నటుడిగా, హీరోగా రాణిస్తూనే.. క్రికెట్ యాంకర్ గా కూడా చేస్తున్నాడు. ఇక యాంకర్ గా రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ తో, యాంకరింగ్ తో రష్మీ టాలీవుడ్ లో పాపులర్ అయింది. గుంటూర్ టాకీస్ లాంటి బోల్డ్ మూవీలో కూడా నటించింది. 

వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం 'బొమ్మ బ్లాక్ బస్టర్'. డెబ్యూ డైరెక్టర్ రాజ్ విరాట్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. నేడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ బర్త్ డే సందర్భమగా 'పూరి ఆంథమ్ పేరుతో ఓ మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు. పూరి డైలాగులతో ఉన్న ఈ పాటలో నందు, రష్మీ మాస్ స్టెప్పులతో చిందేశారు. 

'పుట్టుకతోనే నువ్వు గెలిచి వచ్చావ్.. ఇంకా నీకు ఓటమి ఏంటన్నా' అంటూ పూరి స్టైల్ లో ఉండే డైలాగులతో పాట మొదలవుతుంది. రాజుల కాలం గెటప్పులతో రష్మీ, నందు అలరిస్తున్నారు. పూరి జగన్నాధ్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఈ పాట మాస్ ప్రియులని అలరించే విధంగా ఉంది. 

ఈ చిత్రాన్ని ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ పాటకి మంగ్లీ, ప్రణవ్ చాగంటి గాత్రం అందించారు. 

 

click me!