అన్ని ప్రశ్నలకు 11వ తేదీ సమాధానం.. పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ ట్వీట్ వైరల్

pratap reddy   | Asianet News
Published : Sep 28, 2021, 11:29 AM IST
అన్ని ప్రశ్నలకు 11వ తేదీ సమాధానం.. పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ ట్వీట్ వైరల్

సారాంశం

గబ్బర్ సింగ్ చిత్రంతో టాలీవుడ్ లో నిర్మాతగా నిలదొక్కుకున్నాడు బండ్ల గణేష్. ఆ తర్వాత బండ్ల గణేష్ కు వరుస విజయాలు దక్కాయి. ప్రస్తుతం బండ్ల గణేష్ నిర్మాతగా కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నాడు.

గబ్బర్ సింగ్ చిత్రంతో టాలీవుడ్ లో నిర్మాతగా నిలదొక్కుకున్నాడు బండ్ల గణేష్. ఆ తర్వాత బండ్ల గణేష్ కు వరుస విజయాలు దక్కాయి. ప్రస్తుతం బండ్ల గణేష్ నిర్మాతగా కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ మా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశాడు. 

మరోవైపు రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ సమస్యలపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నాని, కార్తికేయ ఇలా కొందరు నుంచి మినహా పవన్ కళ్యాణ్ కి మద్దతు లభించలేదు. పొలిటికల్ గా మాత్రం జనసేన పార్టీ నేతలు వైసీపీకి ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. 

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ని తన దైవంగా భావించే బండ్ల గణేష్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలనేది అభిమానుల కోరిక. ప్రస్తుతం మా ఎన్నికలతో బిజీగా ఉన్న గణేష్ అక్టోబర్ 10న ఎన్నిక ముగిసిన తర్వాత 11వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తా అని ప్రకటించారు. 

ఇలాంటి హాట్ సిచ్యువేషన్ లో గణేష్ పవన్ ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 'నా పయనం, నా గమ్యం, నా ధైర్యం.. మీతోనే నా ప్రయాణం.. శ్వాస ఉన్నంతవరకు మీరే నా దైవం జై పవర్ స్టార్' అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది. 

అదే విధంగా ' బండ్ల గణేష్ జనరల్ సెక్రటరీగా పోటీ చేయడం ఒక ఎత్తైతే.. అక్టోబర్ 11న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మరో ఎత్తు' అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ని బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్