పంజాబీ సింగర్ హనీ సింగ్ (Honey Singh) - షాలినీ తల్వార్ ఈరోజు అధికారికంగా డివోర్స్ తీసుకున్నారు. గతేడాది హనీ సింగ్ పై గృహహింసపై కేసు నమోదు కాగా.. షాలినీకి డివోర్స్ తోపాటు భరణం కూడా అందించారు.
పంజాబీ సింగర్, యాక్టర్ యోయో హనీ సింగ్ (Yo Yo Honey Singh) - షాలినీ తల్వార్ ఈరోజు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. గతేడాది షాలినీ తల్వార్ లైంగిక వేధింపులు, గృహహింస కింద ఢిల్లీ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఏడాది పాటుగా పలుసార్లు విచారణ జరిపిన న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది.
ఈ రోజు న్యాయమూర్తి వినోద్ కుమార్ సమక్షంలో హనీ సింగ్ - శాలిని తల్వార్‌కు విడాకులతో పాటు భరణంగా రూ.కోటి కూడా అందించారు. ఈ కేసు తదుపరి విచారణ 2023 మార్చి 20న మళ్లీ జరగనుంది. అందులో తదుపరి మోషన్‌పై విచారణ చేయనున్నారు.
గృహ హింస కేసుపై హనీ సింగ్ సోషల్ మీడియాలో గతంలోనే ఎమోషన్ నోట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలను 'తప్పుగా, దురుద్దేశంగా' భావించారు. షాలినీ తల్వార్ తనపై మరియు తన కుటుంబంపై విధించిన తప్పుడు మరియు హానికరమైన ఆరోపణలకు తీవ్ర బాధపడ్డట్టు చెప్పారు. ఆరోపణలు చాలా అసహ్యకరమైనవిగా పేర్కొన్నారు.
15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నానడని, దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు, సంగీతకారులు తన భార్యతో ఎలా ఉంటాడో తెలుసన్నారు. పదేండ్లకు పైగా తన షూట్‌లు, ఈవెంట్‌లు, సమావేశాలకు కూడా ఆమె ఎల్లప్పుడూ కలిసి వచ్చిందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను గట్టిగా ఖండిస్తున్నాని హానీ సింగ్ పేర్కొన్నారు. దేశంలోని న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. త్వరలోనే నిజం బయటపడుతుందని తను విశ్వసిస్తున్నట్టు తెలిపారు.