Bigg Boss Telugu 6: హోరా హోరీగా తలపడ్డ కంటెస్టెంట్స్... మొదటి కెప్టెన్ ఎవరు? 

Published : Sep 09, 2022, 05:00 PM IST
Bigg Boss Telugu 6: హోరా హోరీగా తలపడ్డ కంటెస్టెంట్స్... మొదటి కెప్టెన్ ఎవరు? 

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ కెప్టెన్ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. బిగ్ బాస్ దీనికి సంబంధించి టాస్క్ నిర్వహించగా కంటెస్టెంట్స్ పోటీపడ్డారు.   

    
బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడిప్పుడే గేమ్ హీటెక్కుతోంది. కంటెస్టెంట్స్ మధ్య కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ నిర్వహించారు. ఫైమాను సంచాలకురాలిగా పెట్టి కెప్టెన్సీ పోటీ నిర్వహించారు. క్లాస్ లో నేహా చౌదరి, గీతూ రాయల్, ఆది రెడ్డితో పాటు మాస్ లో ఉన్న మారిన- రోహిత్,  బాల ఆదిత్య, ఆర్జే సూర్య కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. వీరి మధ్య కెప్టెన్సీ బండి టాస్క్ నిర్వహించారు. ఇక హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ కావాలని అందరూ తెగ కష్టపడ్డారని ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. 

మరి ఇంటికి ఫస్ట్ కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి. మరోవైపు ఎలిమినేషన్స్ కి ఏడుగురు నామినేట్ అయ్యారు. ఫైమా, ఇనయా సుల్తానా, అభినయశ్రీ, రేవంత్, ఆరోహి రావు, చలాకి చంటి నామినేషన్స్ లో ఉన్నారు. వీరి నుండి ఒకరు వచ్చే ఆదివారం ఎలిమినేట్ కానున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

కంటెస్టెంట్స్ అందరూ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. సింగర్ రేవంత్ పై మెజారిటీ ఇంటి సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇక కపుల్ గా ఎంట్రీ ఇచ్చిన మారిన-రోహిత్ మధ్య అప్పుడే గిల్లి కజ్జాలు మొదలయ్యాయి. సత్యశ్రీ తన భర్తతో క్లోజ్ గా ఉంటుందని మారిన నొచ్చుకుంటుంది. ఈ విషయంలో నిలదీసింది కూడా. తర్వాత జస్ట్ ఫ్రాంక్ అంటూ కలరిచ్చారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు