Puneeth Rajkumar death:కుమార్తె వచ్చిన తర్వాతే.. పునీత్ అంత్యక్రియల వివరాలు

pratap reddy   | Asianet News
Published : Oct 30, 2021, 08:22 AM IST
Puneeth Rajkumar death:కుమార్తె వచ్చిన తర్వాతే.. పునీత్ అంత్యక్రియల వివరాలు

సారాంశం

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శుక్రవారం పునీత్ రాజ్ కుమార్ జిమ్ వర్కౌట్స్ చేస్తూ అనుకోని విధంగా గుండెపోటుకు గురయ్యారు.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శుక్రవారం పునీత్ రాజ్ కుమార్ జిమ్ వర్కౌట్స్ చేస్తూ అనుకోని విధంగా గుండెపోటుకు గురయ్యారు. దీనితో కుటుంబ సభ్యులు హుటాహుటిన పునీత్ ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమం కావడంతో పునీత్ మరణించారు. 

Puneeth Rajkumar కు నివాళులు అర్పించేందుకు సెలెబ్రిటీలు చేరుకుంటున్నారు. అయితే పునీత్ అంత్యక్రియలకు సంబంధించిన వివరాలని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పునీత్ పెద్ద కుమార్తె వందిత ప్రస్తుతం యూఎస్ లో ఉంది. శనివారం ఆమె యూఎస్ నుంచి తిరిగి రానుంది. ఆమె వచ్చిన తర్వాతే పునీత్ అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభిస్తాం అని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ ప్రకటించారు. 

Also Read: Puneeth rajkumar death:పవన్ కళ్యాణ్ కోసమే పునీత్ ఆ పని చేశాడా.. రవ్వంత కూడా గర్వంలేని వ్యక్తిత్వం

పునీత్ తండ్రి రాజ్ కుమార్ సమాధి పక్కనే ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తాం అని ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం పునీత్ పార్థివదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. అక్కడి నుంచి కంఠీరవ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. శనివారం సాయంత్రం రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి. 

దీనికోసంఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్ణాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. దాదాపు 6000 మంది పోలీసులని, ఇతర భద్రత బలగాలని మోహరించారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?