
మెగా చిన్నల్లుడు...యంగ్ హీరో కళ్యాణ్ దేవ్ హోలీ సంబరాలో మునిగితేలారు. కాని తన భార్య.. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ లేకుండానే కళ్యాణ్ దేవ్ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు.
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ఈ మధ్య సోషల్ మీడియా పోస్ట్ లతో తెగ హడావిడి చేస్తున్నుడు. ఆయన ఏ పోస్ట్ పెట్టినా.. అది సెన్సేషనే అవుతోంది. సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ పెట్టే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. రీసెంట్ గా తాను హోలీనీ గ్రాండ్ గా సెలబ్రీట్ చేసుకున్నాడు. ఈ ఫోటోస్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. కాకపోతే తన భార్య శ్రీజ లేకుండానే హోలీని సెలబ్రేట్ చేసుకున్నాడు కళ్యాణ్ దేవ్.
హోలీ పండగను పురస్కరించుకుని కల్యాణ్‌దేవ్ ఫల్ గా కలర్ ను పులుముకుని తన ముఖమంతా రంగులతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ హోలీ రోజు ప్రేమ, సరదాలను పంచండంటూ ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే తన కూతుళ్లు నివృత్తి, నవిష్క సెలబ్రేట్ చేసుకున్న హోలీ వీడియోలను కూడా ఇన్‌స్టా స్టోరీలో శేర్ చేశాడు కళ్యాణ్ దేవ్. వీటికి క్యాప్షన్ కూడా ఇఛ్చాడు. రంగుల్లో మునిగి పోయారంటూ కామెంట్ చేశాడు.
కాని ఈ హోలీ వేడుకల్లో ఎక్కడా శ్రీజ కనిపించలేదు. మొత్తానికి కల్యాణ్‌దేవ్ సింగిల్ ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇవే కాదు శ్రీజ లేకుండానే కళ్యాణ్ దేవ్ రీసెంట్ గా ఓ టూర్ కూడా వెళ్లాడు. అటు మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదు.
విజేత సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ దేవ్ ఈ మధ్య సూపర్ మచ్చి సినిమాతో ఆడియన్స్ ను పలకరించాడు. కళ్యాణ్ హీరోగా నటించిన కిన్నెరసాని మూవీ త్వరలో రిలీజ్ కానుంది. కళ్యాణ్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అటు శ్రీజ ముంబయ్ లో ఉంటుందంటూ టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరో వైపు కొంత కాలం నుంచి మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో పెద్దగా కనిపించడం లేదు కల్యాణ్ దేవ్. అంతేకాదు ఈ మధ్య షేర్ చేస్తున్న ఫొటోల్లో శ్రీజ మిస్ అవుతుండటంతో వీళ్లు విడాకులు తీసుకుంటున్నారన్న ఊహాగానాలు బలపడుతున్నాయి.