
కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ కుమార్ మరణించి నాలుగు నెలలు పైనే అవుతుంది. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది అభిమానులు బాధలోమునిగిపోయారు. ఇప్పటికే ఆయన అభిమానులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి చెంది నాలుగు నెలలు గడిచిపోయినా ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు.
46 ఏళ్ల చిన్న వయసులోనే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. ఈవార్తతో కన్నడ సినీ పరిశ్రమ అల్లకల్లోలం అయ్యింది. అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు. టాలీవుడ్ నుంచి కూడా ఎన్టీఆర్,బాలయ్య,చిరు,లాంటి స్టార్స్ కూడా పునిత్ ను చూసి కంటతడి పెట్టుకున్నారంటే.. పునిత్ మరణం ఎంత మందిని బాధపెట్టిందో అర్ధమౌతుంది.
మరోవైపు పునీత్ మృతి చెందిన విషయం ఆయన మేనత్త నాగమ్మకు ఇప్పటి వరకు చెప్పలేదట కుటుంబ సభ్యులు. పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు నాగమ్మ సొంత చెల్లెలు. తన మేనల్లుడు పునీత్ అంటే ఆమెకు పంచ ప్రాణాలు. ఆమె వయసు 90 ఏళ్లు. పునీత్ మరణించాడనే వార్తను విని ఆమె తట్టుకోలేదన్న ఉద్దేశంతో, ఇంతవరకు ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచారు.
అంతే కాదు పునీత్ గురించి ఆమె అడిగినప్పుడల్లా ఔట్ డోర్ షూటింగ్ లో ఉన్నాడని చెపుతున్నారట. కొన్నాళ్ల క్రితం పునిత్ రాజు కుమార్ అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ గుండెపోటు వచ్చిందని తెలిసి తట్టుకోలేక నాగమ్మ హాస్పిటల్ పాలు అయ్యారని. ఆమె కోలుకోవడానికి చాలా టైమ్ పంట్టిందట. తన మేనల్లుడళ్ళ ను తన సోంత పిల్లల్లా చూసుకున్న నాగమ్మ.. వాళ్లకు ఏమైనా జరిగిందని తెలిస్తే తల్లడిల్లేవారట. అందుకే పునీత్ చనిపోయాడన్న విషయాన్ని ఇప్పటికీ ఆమెకు చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచారట.