`విరాటపర్వం` సాంగ్‌ అప్‌డేట్‌.. `నగాదారిలో` పాట గ్లింప్స్ విడుదల..

Published : Jun 01, 2022, 07:44 PM ISTUpdated : Jun 01, 2022, 07:47 PM IST
`విరాటపర్వం` సాంగ్‌ అప్‌డేట్‌.. `నగాదారిలో` పాట గ్లింప్స్ విడుదల..

సారాంశం

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటించిన `విరాటపర్వం` విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా ఈ చిత్రంలోని `నగాదారిలో` పాట గ్లింప్స్ ని విడుదల చేశారు.

రానా(Rana), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన `విరాటప్వం`(Virataparvam) చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్‌ కాబోతుంది. జులై 1న రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమాని ప్రీ పోన్‌ చేసిన విషయం తెలిపిందే. దీంతో ఈ సినిమా ముందుగానే థియేటర్లలో సందడి చేసేందుకు వస్తుంది. ఇందులో ప్రియమణి, నివేదా పేతురాజ్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 మాజీ నక్సలైట్‌ రవన్న జీవితం ఆధారంగా 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు వేణు ఉడుగుల. సినిమా విడుదలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్‌. ఆకాశవాణి విరాటపర్వం వార్తలు పేరుతో ఈసినిమాకి సంబంధించిన అప్‌డేట్లని ఇవ్వబోతున్నట్టు తెలిపారు. అందులో భాగంగా జూన్‌ 2న `నగాదారిలో`(Nagaadaarilo) పాటని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. 

తాజాగా ఈ పాటకి సంబంధించిన గ్లింప్స్ ని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. `నిప్పు ఉంది, నీరు ఉంది నగదారిలో.. చివరికి నెగ్గేదేది, తగ్గేదేది నగాదారిలో` అంటూ సాగే పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హృదయాలను దోచుకుంటుంది. వినసొంపుగా సాగే ఈ పాట వీడియోలో రానా, సాయిపల్లవిల మధ్య ప్రేమ కథని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. నక్సల్‌ పోరాటాన్ని నిప్పుగా, సాయిపల్లవితో ప్రేమని నీరుగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. 

ఇక ఈ పాటకి సురేష్‌ బొబ్బిలి సంగీతం అందించగా, వరం ఈ పాటని ఆలపించారు.ఈ పాటని ద్యావరి నరేందర్‌ రెడ్డి, సనపతి భరద్వాజ్‌ పాత్రుడు రాశారు. ఈ పూర్తి పాట రేపు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో  రానా కామ్రేడ్ రావన్న పాత్రలో నటిస్తుండగా, ఆయన కవితలు చదివి అతడి ప్రేమ కోసం వెళ్లే యువతి వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు