వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత సురేష్‌బాబుని బురిడీ కొట్టించిన కేటుగాడు

Published : Jun 22, 2021, 09:57 AM IST
వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత సురేష్‌బాబుని బురిడీ కొట్టించిన కేటుగాడు

సారాంశం

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సురేష్‌బాబుని ఓ కేటుగాడికి దొరికిపోయాడు. వ్యాక్సిన్ల పేరుతో సురేష్‌బాబుని బురిడీ కొట్టించాడు నేరగాడు. తన వద్ద వ్యాక్సిన్లు ఉన్నాయని చెప్పి అక్షరాల లక్ష రూపాయలు గుంజేశాడు. 

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సురేష్‌బాబుని ఓ కేటుగాడికి దొరికిపోయాడు. వ్యాక్సిన్ల పేరుతో సురేష్‌బాబుని బురిడీ కొట్టించాడు నేరగాడు. తన వద్ద వ్యాక్సిన్లు ఉన్నాయని చెప్పి అక్షరాల లక్ష రూపాయలు గుంజేశాడు. ఓ వ్యక్తి తన వద్ద కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని నిర్మాత సురేష్‌బాబు ఆఫీస్‌కి ఫోన్‌ చేశాడు. దీంతో అది నిజమని నమ్మిన మేనేజర్‌ అతను అడిగిన లక్ష రూపాయలు ఆన్‌లైన్‌లో ట్రాన్స్ ఫర్‌ చేశాడు. మనీ తన అకౌంట్‌లోకి రావడంతో ప్లేట్‌ పిరాయించాడు ఆ కేటుగాడు. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ఫోన్‌ లిఫ్ట్ చేయడం లేదు. 

దీంతో తాము మోసపోయామని మేనేజర్‌కి అర్థమైంది. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషనల్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కరోనాని ఆసరగా చేసుకుని కేటుగాళ్లు ఎంతటి దారుణాలకు దిగజారుతున్నారో అర్థం చేసుకోవచ్చు. వెల్‌ ఎడ్యూకేటెడ్‌, తెలివైన నిర్మాత అయినా సురేష్‌బాబునే మోసపోతే, ఇక సాధారణ జనాల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?