దళపతి విజయ్‌ మరో సర్‌ప్రైజ్‌.. `బీస్ట్` సెకండ్‌ లుక్‌.. పర్‌ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్

Published : Jun 22, 2021, 09:36 AM IST
దళపతి విజయ్‌ మరో సర్‌ప్రైజ్‌.. `బీస్ట్` సెకండ్‌ లుక్‌.. పర్‌ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్

సారాంశం

విజయ్‌ పుట్టిన రోజు నేడు(జూన్‌ 22). ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ని ఒక్క రోజు ముందుగానే విడుదల చేశారు. ఇక ఫ్యాన్స్ కి మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు విజయ్‌.

దళపతి విజయ్‌ తమిళంలో ఓ సూపర్‌ స్టార్‌. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ రేంజ్‌ హీరో. సూపర్‌ స్టార్‌ రజనీ తర్వాత ఆ స్థాయి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో అని చెప్పొచ్చు. లవ్‌ స్టోరీస్‌, ఫ్యామిలీ మూవీస్‌, యాక్షన్‌ చిత్రాలు, సందేశాత్మక సినిమాలు ఇలా అన్ని రకాల చిత్రాలతో కోలీవుడ్‌ ఆడియెన్స్ ని అలరించారు. అలరిస్తున్నారు. ఇటీవల కాలంలో సందేశాలు, కమర్షియల్‌ అంశాలు మేళవించిన చిత్రాలతో ఆకట్టుకున్నారు విజయ్‌. 

తాను చేసే ప్రతి అంశంలోనూ సమాజానికి ఉపయోగపడే అంశాలుండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల తమిళనాడు ఎన్నికల ఓటింగ్‌ రోజు సైకిల్‌పై పోలింగ్‌ బూత్‌కి వెళ్లి పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల పెరుగుదలపై నిరసనని తెలియజేశాడు. అదే సమయంలో సినిమాలతోనూ సమాజంలోని అంశాలను చర్చిస్తుంటాడు. ఆడియెన్స్ కి ఎంతో కొంత నిజాయితీతో కూడిన సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాడు. మూడు దశాబ్దాలుగా తిరుగులే ఇమేజ్‌తో రాణిస్తున్నారు విజయ్‌.

 అభిమానులు ముద్దుగా ఇళయ దళపతిగా పిలుచుకునే విజయ్‌ పుట్టిన రోజు నేడు(జూన్‌ 22). ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ని ఒక్క రోజు ముందుగానే విడుదల చేశారు. ఇక ఫ్యాన్స్ కి మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు విజయ్‌. తాను నటిస్తున్న 65వ చిత్రం `బీస్ట్` నుంచి మరో లుక్‌ని విడుదల చేశారు. వెనకాల ఆర్మీ హెలికాప్టర్‌ చక్కర్లు కొడుతుండగా చేతిలో గన్‌తో, మాస్‌ లుక్‌లో అదరిపోయేలా ఉన్నాడు విజయ్‌. బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కి మంచి ఫుల్‌ మీల్స్ లాంటి గిఫ్ట్ ఇచ్చారని అంటున్నారు కోలీవుడ్‌ సినీజనాలు. 

విజయ్‌ 65వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. అయితే ఈ రోజున విజయ్‌ మరో గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని టాక్‌. మరో కొత్త మూవీని అనౌన్స్ చేసే అవకాశాలున్నాయట. ఆయన తెలుగు డైరెక్టర్‌ వంశీపైడిపల్లితో ఓ సినిమాకి కమిట్‌ అయినట్టు ప్రచారం జరుగుతుంది. తెలుగు, తమిళంలో ఈ సినిమా రూపొందుతుందని, దిల్‌రాజు నిర్మిస్తాడని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?