'అల..వైకుంఠపురుములో' హిందీ రీమేక్ టైటిల్

Surya Prakash   | Asianet News
Published : Jun 22, 2021, 09:10 AM IST
'అల..వైకుంఠపురుములో' హిందీ రీమేక్ టైటిల్

సారాంశం

 తెలుగులో సూపర్ డూపర్ హిట్ సాధించిన 'అల.. వైకుంఠపురములో' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ వెర్షన్ కు ఏమి టైటిల్ పెట్టబోతున్నారనే విషయమై బాలీవుడ్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి.  

‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా.. నన్ను సుట్టూకుంటివే’ ఈ పాట,విజువల్స్ త్వరలో హిందీ జనాలను అలరించనున్నాయి. అల్లు అర్జున్‌ కెరీర్ లో పెద్ద హిట్ట గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ హిందీలో రీమేక్‌ కానున్న విషయం తెలిసిందే. కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటుడు వరుణ్‌ ధావన్‌ సోదరుడు రోహిత్‌ ధావన్‌ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో హీరోయిన్ గా కృతీ సనన్‌ చేయబోతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ వెర్షన్ కు ఏమి టైటిల్ పెట్టబోతున్నారనే విషయమై బాలీవుడ్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి.  

అందుతున్న సమాచారం మేరకు...ఈ చిత్రం హిందీ వెర్షన్ కు 'షెహ్జాదా' అనే టైటిల్ ఫిక్స్ చేసారు.  కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.  సినిమాలో హీరో తల్లి క్యారెక్టర్ అయిన టబు పోషించిన క్యారెక్టర్ హిందీలో ఎవరు చేస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే ఆ పాత్రలో ప్రస్తుతం సీనియర్ బ్యూటీ మనీషా కోయిరాల ఓకే అయినట్లు తెలుస్తుంది. దర్శకుడు డేవిడ్ ధావన్ ఆల్రెడీ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసాడట. ఇప్పటికే ఈ రీమేక్ హక్కుల కోసం బాలీవుడ్ బడా నిర్మాత పెద్ద మొత్తం వెచ్చించారని టాక్.

బాలీవుడ్ కథనాల ప్రకారం.. ఆ క్యారెక్టర్ కోసం ఒరిజినల్ పోషించిన టబునే సంప్రదించారట. కానీ ఆమె ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉండేసరికి మరో యాక్టర్ దగ్గరకు వెళ్లకతప్పలేదని టాక్. ఈ సినిమాను  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. అలాగే ఇంతకు  ముందు కార్తీక్ ఆర్యన్ - కృతిసనన్ కలిసి లుక్కాచుప్పి సినిమాలో నటించారు. ఈ  సినిమాతో ఈ కాంబో మరోసారి హిట్ కొడుతుందంటున్నారు. అతిత్వరలో ఈ మూవీపై అఫీషియల్ ప్రకటన రానుందని బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం.

హిందీలో అలవైకుంఠపురం రీమేక్ కి రెడీ అవుతుంటే మరో వైపు సౌత్ లోనే తమిళ్ లో కూడా రీమేక్ చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు. శివ కార్తికేయన్ హీరోగా ఈ సినిమాని రీమేడ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమీజా..తమిళ్ వర్‌షన్ కి మ్యూజిక్ అందించబోతున్నారు. ఇలా హిందీలో కార్తీక్ ఆర్యన్, తమిళ్ లో శివకార్తికేయన్ కలిసి ..  అలవైకుంఠపురం సినిమాని రీమేక్ చెయ్యబోతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌