పవన్ గురించి కోటకు ఏం పని, మైక్ ఇస్తే వాగేస్తారా? ఘాటు కౌంటర్

 ఒకరి మీద ఆయన పడకూడదు...కోటకు మైక్ ఇచ్చారు..వాగేయటం మొదలెట్టేసారు..ముసలాయన, ఏజ్ అయ్యిపోయింది...కాబట్టి ఆయన హద్దులో ఆయన ఉంటే బెటర్. 

Producer #NattiKumar counter to #KotaSrinivasRao Comments on Pawan Klayan

రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటా అంటూ తన రెమ్యునరేషన్ పై పవన్ కళ్యాణ్  స్టేట్ మెంట్ ఇవ్వడాన్ని సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలు సైతం ఏనాడు తమ రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదన్నారు. అలాంటి ఇప్పుడు మైకు పట్టుకొని కోట్లు రూపాయలు తీసుకుంటున్నామని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై కోటపై చాలా మంది పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఆయనకు ఎందుకు అని విమర్శ చేస్తున్నారు.  తాజాగా ఆ నిర్మాత నట్టికుమార్ సైతం కోట ని ఈ విషయమై నిలదీసారు.

నట్టికుమారు మాట్లాడుతూ..." వయస్సు అయ్యిపోయిన కోట శ్రీనివాసరావుకు ఎందుకు..ఏం అవసరం...పవన్ కళ్యాణ్ నిజాయితీగా ,నీతిగా నేను టాక్స్ కడుతున్నాను..నేను టాక్స్ పేయర్ ని, నేను ఇంత తీసుకుంటున్నా ..నేను ఇంత తీసుకుంటున్నా కూడా ప్రజల కోసం అవన్నీ వదులుకుని వస్తున్నాను..బ్రతుకుతున్నాను...నాకు ఓటేయండి..నేను మీ కోసం కష్టపడతా..మీ కోసం శ్రమిస్తా అంటున్నారు..అందులో తప్పేముంది..ఆయన టాక్స్ కడుతున్నాడు కాబట్టి చెప్పారు..కోట టాక్స్ ఎగ్గొడుతున్నాడు కాబట్టి చెప్తున్నారా..కోట మూడు షిప్ట్ లు, నాలుగు షిప్ట్ లు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఒకరి మీద ఆయన పడకూడదు...కోటకు మైక్ ఇచ్చారు..వాగేయటం మొదలెట్టేసారు..ముసలాయన, ఏజ్ అయ్యిపోయింది...కాబట్టి ఆయన హద్దులో ఆయన ఉంటే బెటర్. కోట ...నిర్మాతకు టైట్ ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు... పవన్ కళ్యాణ్ రూపాయి ఇచ్చేవాడే కానీ ,ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు" -   అన్నారు నట్టికుమార్. 

Latest Videos

 కొద్ది రోజుల క్రితం ఓ రాజకీయ ర్యాలీలో పవన్ తాను తీసుకునే రెమ్యునరేషన్ గురించి కీలక విషయాలు చెప్పారు.  తాను డబ్బు కోసమే అధికారంలోకి రావాలని చూస్తున్నానన్న విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తనకు డబ్బుతో పనిలేదని, సినిమాల్లోనే భారీగా సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. తాను ఒక రోజు షూటింగ్ కోసం రూ.2 కోట్లు తీసుకుంటానని చెప్పాడు. "నాకు డబ్బు అవసరం లేదు. నేను అలాంటి మనిషిని కూడా కాను. అవసరమైతే నేను సంపాదించి. ఆ డబ్బును దాన ధర్మాల కోసం వినియోగిస్తాను. నేను ఎలాంటి భయం లేకుండా చెప్తున్నాను.  ఇప్పుడు నేనో సినిమా షూటింగ్ చేస్తున్నా. దాని కోసం రోజుకు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నా. అంటే 20 రోజుల షూటింగ్ కు నాకు రూ.45 కోట్ల వరకూ ఇస్తున్నారు. నేను ప్రతి సినిమాకు ఇంత సంపాదిస్తున్నానని చెప్పడం లేదు. కానీ, నా రోజు వారీ రెమ్యునరేషన్ అంత ఉంటుంది” అని ఆ ర్యాలీలో వెల్లడించారు.   

vuukle one pixel image
click me!