రాహుల్ రామకృష్ణ 'ఇంటింటి రామాయణం' ట్రైలర్.. ఫన్ తో భలే మ్యాజిక్ చేస్తున్నారే 

Published : Jun 07, 2023, 09:44 PM IST
రాహుల్ రామకృష్ణ 'ఇంటింటి రామాయణం' ట్రైలర్.. ఫన్ తో భలే మ్యాజిక్ చేస్తున్నారే 

సారాంశం

యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ, బుల్లితెర నటి నవ్య స్వామి జంటగా నటిస్తున్న చిత్రం ఇంటింటి రామాయణం. ఇటీవల తెలంగాణ యాసతో వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భలే మ్యాజిక్ చేస్తున్నాయి

యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ, బుల్లితెర నటి నవ్య స్వామి జంటగా నటిస్తున్న చిత్రం ఇంటింటి రామాయణం. ఇటీవల తెలంగాణ యాసతో వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భలే మ్యాజిక్ చేస్తున్నాయి. ఇంటింటి రామాయణం చిత్రాన్ని కూడా అదే తరహాలో తెరకెక్కించారు. 

జూన్ 9న అంటే మరో రెండు రోజుల్లో రిలీజ్ ఉండగా నేడు చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సురేష్ నారెడ్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్ ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది. సీనియర్ నటుడు నరేష్, గంగవ్వ ఇతర పాత్రల్లో నటించారు. 

పల్లెటూరి సరదాలు, మద్యం చిందులు ట్రైలర్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి రహస్య ప్రేమికులుగా నటిస్తున్నారు. స్నేహితులు, బంధువుల మధ్య గొడవలని ఫన్నీగా ప్రతి పల్లెటూరిలో జరిగే సంఘటనలతో చూపించారు. 

 

చివరకు బంగారం దొంగతనం జరిగిన సంఘటనలతో పెద్ద గొడవ చెలరేగుతుంది. ఈ గొడవలో రాహుల్ రామకృష్ణ ఎలా ఇరుక్కుపోయాడు అనేది సినిమాలో ఆసక్తికర అంశం.. అలాగే నవ్య స్వామితో అతడిప్రేమ ఎలా బయటపడుతుంది అనేది కూడా సస్పెన్స్. ఓవరాల్ గా థియేట్రికల్ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌