Acharya Update: మెగా ఫ్యాన్స్ కోసం ఆచార్య నుంచి భారీ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఏం ఇవ్వబోతున్నారు...?

Published : Dec 23, 2021, 12:14 PM ISTUpdated : Dec 23, 2021, 12:15 PM IST
Acharya Update:  మెగా ఫ్యాన్స్ కోసం ఆచార్య నుంచి భారీ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఏం ఇవ్వబోతున్నారు...?

సారాంశం

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆచార్య మూవీ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ గా  భారీ అప్ డేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అంత భారీ స్థాయిలో న్యూ ఇయర్ భహుమతి ఏం ఇస్తారా అని.. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)- మెగా పవర్ స్టార్  రామ్ చరణ్(Ram Charan) కలిసి నటిస్తున్న మెగా మల్టీ స్టారర్ మూవీ ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో.. చిరంజీవి సరసన సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal) నటిస్తుండగా.. రామ్ చరణ్ జోడీగా యంగ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆచార్యను పిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు టీమ్.

 ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలా అప్ డేట్స్ రిలీజ్ అయ్యాయి. మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలు ఊగించాయి. మణిశర్మ కంపోజ్ చేసిన.. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ పాటలు అలరించాయి. ఇంట్రెడక్షన్ సీన్స్.. స్పెషల్ టీజర్స్ తో.. ఆచార్య(Acharya) ప్రమోషన్స్ విషయంలో అందరికంటే ముందే ఉంది. అయితే ఇప్పుడు మరో భారీ అప్ డేట్ కు మెగా టీమ్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆచార్య నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ గా మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వాలని చిరంజీవి(Chiranjeevi)  భావించారట. అందుకే ఏ అప్ డేట్ ఇస్తే బాగుంటుంది అని టీమ్ అంతా ఆలోచించి.. కొన్ని ఐడియాస్ ను పంచుకుని..  చివరికి ఒక నిర్ణాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.  ఆచార్య నుంచి  చిరంజీవి, రామ్ చరణ్ కు సంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ తో.. టీజర్ కాని.. ట్రైలర్ కాని రిలీజ్ చేయలని  చూస్తున్నారట. ఇది వర్కైట్ కాకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో.. పవర్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్.

మెగా మూవీ నుంచి చిన్న పోస్టర్ వచ్చినా.. అది వైరల్ అవుతుంది. అటువంటిది మెగా తండ్రీ కొడుకులు కాంబినేషన్ లో ఏ అప్ డేట్ వచ్చినా అది రచ్చ చేయడం కాయం. ఇప్పటికే మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆచార్య నుంచి మెగాస్టార్ లుక్.. రామ్ చరణ్ లుక్ సంబంధించిన అప్ డేట్స్ మాత్రమే ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో సాలిడ్ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈసారైనా వస్తుందని ఆలోచిస్తున్నారు.

సినిమా రిలీజ్ కు ఇంకా నెలరోజులకు పైగా టైమ్ ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో పక్కా ప్లాన్ చేసుకుని ఉన్నారు ఆచార్య టీమ్. న్యూ ఇయర్ కు రిలీజ్ చేయబోయే స్పెషల్ అప్ డేట్ తోనే.. అఫీషియల్ గా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అందరికంటే డిఫరెంట్ గా.. సినిమాను ప్రమోట్ చేయాలని చూస్తున్నారు టీమ్. సినిమా విషయంలో కూడా ఏం తేడా రాకుండా కొన్ని ప్యాచ్ వర్క్స్ కూడా ఈమధ్య చేసేసినట్టు తెలుస్తోంది.   

PREV
click me!

Recommended Stories

Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది