సినీ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!

Published : Feb 13, 2019, 01:44 PM ISTUpdated : Feb 13, 2019, 02:08 PM IST
సినీ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!

సారాంశం

ప్రముఖ సినీ నిర్మాత నారా జయశ్రీదేవి ఈరోజు హైదరాబాద్ లో కన్నుమూశారు

ప్రముఖ సినీ నిర్మాత నారా జయశ్రీదేవి ఈరోజు హైదరాబాద్ లో కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 

సాయంత్రం జయశ్రీదేవి మృతదేహాన్ని బెంగులూరుకి తరలించనున్నారు. శ్రీమంజునాథ, వందేమాతరం, చంద్రవంశం వంటి చిత్రాలకు జయశ్రీదేవి నిర్మాతగా వ్యవహరించారు. ఆమె మరణవార్త తెలిసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

ఇటీవల జయశ్రీకి చెక్ బౌన్స్ కేసులో న్యాయస్థానం ఆరు నెలల పాటు శిక్షను విధించింది. 2005లో అశ్విని పిక్చర్స్ ఓనర్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అయిన ఆనంద్ నుండి రూ.17.40 లక్షలను ఆమె అప్పుగా తీసుకున్నారు. డబ్బు తిరిగిచ్చే సమయంలో ఆమె ఆనంద్ కు చెక్ ఇచ్చారు కానీ అది బౌన్స్ అవ్వడంతో ఆమెకి ఆరు నెలల జైలు శిక్ష పడింది.  
 

PREV
click me!

Recommended Stories

Daredevil: అజిత్ అభిమానులకు గుడ్ న్యూస్, షాలిని విషయంలో సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసిన హీరో
Kiara Advani Festive Looks: పండగకి మెరిసిపోవాలా? కియారా బ్లింగ్ ఐడియాలు అదుర్స్..