ఎన్టీఆర్ హీరోయిన్ మరోసారి తల్లి కాబోతుంది!

Published : Feb 13, 2019, 12:27 PM IST
ఎన్టీఆర్ హీరోయిన్ మరోసారి తల్లి కాబోతుంది!

సారాంశం

బాలీవుడ్ లో 'మైనే దిల్ తుజ్ కో దియా' అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమీరారెడ్డి ఆ తరువాత తెలుగులో 'నరసింహుడు' మూవీతో పరిచయమైంది.

బాలీవుడ్ లో 'మైనే దిల్ తుజ్ కో దియా' అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమీరారెడ్డి ఆ తరువాత తెలుగులో 'నరసింహుడు' మూవీతో పరిచయమైంది. ఆ తరువాత 'అశోక్', 'జై చిరంజీవ' వంటి చిత్రాల్లో నటించి పేరు సంపాదించుకుంది.

పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరంగా ఉన్న సమీరా రెడ్డి తాజాగా తాను గర్భవతి అనే విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోతో పాటు 'నిన్ను కలుసుకోవాలని ఎదురుచూస్తున్నా బేబీ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2014లో సమీరా.. అక్షయ్ వాద్రాని వివాహం చేసుకున్నారు. 2015లో ఆమె ఓ మగబిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి ఆమె తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌