టీటీడీలో కీలక పదవికి ఎంపికైన టాలీవుడ్ నిర్మాత..

చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఉన్న మోహన్ ముళ్ళపూడికి టిటిడి లో కీలక పదవి దక్కింది.  టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా  జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఆయన ఈ పదవి పొందారు. 

Google News Follow Us

చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఉన్న మోహన్ ముళ్ళపూడికి టిటిడి లో కీలక పదవి దక్కింది.  టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా  జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఆయన ఈ పదవి పొందారు. ప్రస్తుత టీటీడీ బోర్డు పదవీకాలానికి అనుగుణంగా శ్రీ వేంకటేశ్వర దేవాలయాలు, జూబ్లీహిల్స్, కరీంనగర్ మరియు హిమాయత్‌నగర్ లోకల్ అడ్వైజరి కమిటీ సభ్యునిగా శ్రీ మోహన్ ముళ్ళపూడి నియమితులయ్యారు. ఈయన గతంలో పలు సినిమాలు నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.

 అలాగే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కు(FNCC) హానరబుల్ సెక్రెటరీ గా మోహన్ వ్యవహరిస్తున్నారు.  ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర దేవాలయాల లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా బాధ్యతలు చేపట్టారు. జూబ్లీహిల్స్, కరీంనగర్ మరియు హిమాయత్‌నగర్‌ లోని టీటీడీ దేవాలయాల మొత్తం అభివృద్ధి లో మరియు కరీంనగర్‌లో నిర్మిస్తున్న కొత్త ఆలయానికి సంబంధించిన పనులలో లోకల్ అడ్వైజరి కమిటీ మెంబర్ గా చేపట్టిన బాధ్యతలను నిర్వహిస్తారు.

టాలీవుడ్ లో పలువురు ప్రముఖులతో మోహన్ ముళ్ళపూడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో మోహన్.. తలసాని లాంటి మంత్రులని కూడా కలిశారు. గతంలో మోహన్ ముళ్ళపూడి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కు(FNCC) హానరబుల్ సెక్రెటరీ గా ఎంపికైనప్పుడు ఆయనతో కలసి నందమూరి తారక రత్న కూడా ఉన్నారు.