Nani : దిల్ రాజు నిర్మాతగా, వేణు దర్శకత్వంలో నాని నెక్ట్స్? అనౌన్స్ మెంట్ ఎప్పుడో తెలుసా?

Published : Jan 08, 2024, 10:34 AM IST
Nani : దిల్ రాజు నిర్మాతగా, వేణు దర్శకత్వంలో నాని నెక్ట్స్? అనౌన్స్ మెంట్ ఎప్పుడో తెలుసా?

సారాంశం

‘హాయ్ నాన్న’తో డీసెంట్ హిట్ అందుకున్న నాని... నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ‘బలగం’ వేణు, దిల్ రాజ్ నిర్మాతగా తదుపరి చిత్రం అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తోంది.

నేచురల్ స్టార్ నాని Nani  రోటీన్ కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. తనదైన పెర్పామెన్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. వరుసగా హిట్లు అందుకుంటున్నారు. రీసెంట్ గా ‘హాయ్ నాన్న’ Hi Nannaతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోనూ టాప్ 1లో ట్రెండింగ్ అవుతోంది. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో నాని నెక్ట్స్ సినిమాలపై ఆసక్తి నెలకొంది. 

ప్రస్తుతం నాని మాత్రం ‘సరిపోదా శనివారం’ Saripoda Sanivaaram మూవీ మీద ఫోకస్ చేస్తున్నారు. ‘అంటే సుందరానికీ...’ మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్​లో వస్తోంది. ఈ ఫిల్మ్​ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున రూపొందుతున్న ‘సరిపోదా శనివారం’ కోసం బడ్జెట్​ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అటు తమిళ కల్ట్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తోనూ ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. 

కానీ ప్రస్తుతం మాత్రం ‘బలగం’ డైరెక్టర్ వేణు ఎల్దండి Venu Yeldandi డైరెక్షన్ లో నాని నటించేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ Dil Raju  నిర్మించబోతున్న ఈ చిత్రంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే సరైనా స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అది అవ్వగానే అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తోంది. ఈ సంక్రాంతికే ప్రకటన చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. 

ఇప్పటికే నాని ‘దసరా’ సినిమాతో రా అండ్ రాస్టిక్ గా కనిపించి అదరగొట్టారు. బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు.  అటు ‘బలగం’తో వేణు ఎల్దండి కూడా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక వీరి కాంబోలో రాబోయే చిత్రానికి మరింతగా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటున్నాయి. ఈ మూవీకి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అఫీషియల్ అప్డేట్ రానుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..