Agent Movie: ఏజెంట్ మూవీపై పుకార్లు... నిర్మాత ట్వీట్ తో క్లారిటీ!

Published : May 17, 2022, 11:45 AM IST
Agent Movie: ఏజెంట్ మూవీపై పుకార్లు... నిర్మాత ట్వీట్ తో క్లారిటీ!

సారాంశం

ఏజెంట్ మూవీపై వరుస రూమర్స్ నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni). డెబ్యూ తో వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొన్న ఈ యంగ్ హీరోకి చివరిగా హిట్ దక్కింది. ఇక అఖిల్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు సురేందర్ రెడ్డితో కమిట్ అయ్యారు. యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సిక్స్ ప్యాక్ బాడీతో బీస్ట్ మోడ్ లోకి మారిన అఖిల్ ఫస్ట్ లుక్ కేకపుట్టింది. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తుండగా... కొన్ని రూమర్స్ తెరపైకి వచ్చాయి. 

ఏకంగా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారన్న ప్రచారం జరిగింది. అలాగే ఏజెంట్ ఆగష్టు 12న విడుదల కావాల్సి ఉండగా... పోస్ట్ ఫోన్ కానుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. వరుస కథనాల నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ సందేశం పోస్ట్ చేశారు. 

ఏజెంట్ (Agent Movie)లేటెస్ట్ షెడ్యూల్ మనాలి లో ప్రారంభమవుతుంది. త్వరలో ఏజెంట్ టీజర్ విడుదలపై అప్డేట్ రానుంది. దయచేసి అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ మాత్రమే ఫాలో అవ్వండి. నిరాధారమైన పుకార్లను నమ్మకండి... అంటూ ట్వీట్ చేశారు. అనిల్ సుంకర ట్వీట్ తో ఏజెంట్ విడుదలపై స్పష్టత వచ్చింది. ఇక ఏజెంట్ టీజర్ విడుదలపై ఆయన హిట్ ఇవ్వగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

ఆ కే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఏజెంట్ తెరకెక్కుతుంది. అఖిల్ కి జంటగా కొత్త అమ్మాయి సాక్షి వైద్య నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఏజెంట్ చిత్రంలో కీలక రోల్ చేయడం విశేషం. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?