Kushi:ఆ చిన్న పదం విజయ్ దేవరకొండ విషయంలో రచ్చ అవుతోంది

Surya Prakash   | Asianet News
Published : May 17, 2022, 11:28 AM IST
Kushi:ఆ చిన్న పదం విజయ్ దేవరకొండ విషయంలో రచ్చ అవుతోంది

సారాంశం

 ప్రస్తుతం కశ్మీర్‌ లోయలోని పలు అందమైన లొకేషన్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరు ఖరారు చేసినట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి.


సోషల్ మీడియా రోజులివి...ప్రతీ చిన్న విషయం బూతద్దంలో చూస్తున్నారు జనం. ముఖ్యంగా సినీ స్టార్స్, సెలబ్రెటీల విషయంలో అది మరి కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ట్విట్టర్ లో విజయ్ దేవరకొండ విషయంలో రచ్చ స్టార్టైంది. అందుకు కారణం చిన్న పదం  ‘The’. వివరాల్లోకి వెళితే..

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం కశ్మీర్‌ లోయలోని పలు అందమైన లొకేషన్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరు ఖరారు చేసినట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడీ పేరునే అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో విజయ్‌ స్టైలిష్‌ లుక్‌లో.. సమంత సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఇక ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు కు ముందు   ‘The’పెట్టడమే రచ్చకు కారణమైంది. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ని ఈ   ‘The’ అని పెట్టడం సూచిస్తోంది అంటున్నారు.

 కశ్మీర్‌ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. దీన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్‌ 23న విడుదల చేయనున్నారు. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో 11వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి తర్వాత సామ్‌, విజయ్‌ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్‌ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంగీతం: హిసమ అబ్దుల్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం: జి.మురళి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Duvvada Srinivas: చీరలమ్మి 7 నెలల్లో 12 కోట్లు సంపాదించా, సక్సెస్ అంటే ఇది
Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?