KRK:సమంత 'కణ్మనీ రాంబో ఖతీజా' OTT రిలీజ్ డేట్

By Surya Prakash  |  First Published May 17, 2022, 11:20 AM IST

‘కణ్మనీ రాంబో ఖతీజా'లో కొత్తదనం ఏమీ లేకపోవడం.. కథనం చాలా స్లోగా సాగడంతో ఫస్టాఫ్‌ అంతో బోర్‌ కొడుతుంది.  కన్మణిగా నయనతార తనదైన నటనతో అదగొడితే.. ఖతీజాగా సమంత తన అందంతో ఆకట్టుకుంది. 
 



టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత, లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్‌'. రొమాంటిక్‌, కామెడీ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి.  ఏప్రిల్‌ 28 సమంత పుట్టినరోజు సందర్భంగా తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన  ఈ మూవీకు తెలుగులో పెద్దగా రెస్పాన్స్ లేదు. ఇద్దరు అమ్మాయిలైన కణ్మనీ, ఖతీజాల మధ్య రాంబో ఎలా నలిగిపోయాడు ? అనేది మూవీ కథాంశంగా వచ్చిన ఈ చిత్రాన్ని మనవాళ్లు పట్టించుకోలేదు.

అయితే తమిళంలో ఈ సినిమా బాగానే డబ్బులు చేసుకుందని నిర్మాతలు సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు  చెప్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.హాట్ స్టార్ లో ఈ చిత్రం ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ హాట్ స్టార్ వారు ఈ చిత్రం క్రేజీ కాంబినేషన్ చూసి మంచి రేటుకు రిలీజ్ కు ముందే లాక్ చేసుకున్నట్లు సమాచారం. 

Latest Videos

హీరోని ఇద్దరు హీరోయిన్లు ప్రేమించడం.. అతన్ని దక్కించుకునేందుకు ఇద్దరు పోటీపడడం, వాళ్ల వల్ల హీరోకు సమస్యలు రావడం..చివరకు ఇద్దరితో హీరో కలిసి ఉండడం.. ఇటు వంటి ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలు తెలుగు, తమిళ బాషల ఆడియన్స్ కు కొత్తేమీ కాదు. ‘కణ్మనీ రాంబో ఖతీజా'లో కొత్తదనం ఏమీ లేకపోవడం.. కథనం చాలా స్లోగా సాగడంతో ఫస్టాఫ్‌ అంతో బోర్‌ కొడుతుంది.  కన్మణిగా నయనతార తనదైన నటనతో అదగొడితే.. ఖతీజాగా సమంత తన అందంతో ఆకట్టుకుంది. 

click me!