సైబర్‌ కేటుగాళ్ల బారిన పడ్డ నిర్మాత బోనీ కపూర్‌.. లక్షల్లో దోపిడి..

Published : May 28, 2022, 09:40 PM IST
సైబర్‌ కేటుగాళ్ల బారిన పడ్డ నిర్మాత బోనీ కపూర్‌.. లక్షల్లో దోపిడి..

సారాంశం

సైబర్‌ నేరగాళ్లకి సినీ సెలబ్రిటీలు అతీతం కావడం లేదు. వారి బారిన పడి లక్షల్లో మోసపోతున్నారు. తాజాగా సైబర్‌ నేరగాళ్ల బారిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ కూడా పడటం హాట్‌ టాపిక్‌ అవుతుంది.

సెబర్‌ నేరగాళ్లు ఇటీవల కాలంలో బాగా రెచ్చిపోతున్నారు. ఎంతో మంది సాధారణ ప్రజల అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా సైబర్‌ నేరగాళ్ల బారిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ కూడా పడటం హాట్‌ టాపిక్‌ అవుతుంది. బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న బోనీ కపూర్‌.. అతిలోక సుందరి శ్రీదేవి భర్త అనే విషయం తెలిసిందే. ఆయన్నుంచి తాజాగా సైబర్‌ కేటుగాళ్లు 3.82 లక్షలు స్వాహా చేశారు. 

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన క్రెడిట్‌ కార్డ్ ద్వారా సదరు అమౌంట్‌ని దోచుకున్నట్టు నిర్మాత బోనీ కపూర్‌ బుధవారం(మే 25)న ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం కింద అంబోలీ పోలీసులు కేసు నమోదు చేశారు. బోనీ కపూర్‌ క్రెడిట్‌ కార్డు వివరాలు, పాస్‌వర్డ్ తదితర డేటాని నిందుతులు చోరీ చేసినట్టు తెలుస్తుంది. ఈ డేటా సహయంతో ఫిబ్రవరి 9న ఐదు ఆన్‌లైన్‌ ట్రాన్సక్షన్స్ జరిపారని తెలుస్తుంది. 

అయితే ఈ లావాదేవీలు జరిపినప్పుడు బోనీ కపూర్‌కు తెలియదని, బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు బిల్లు నిమిత్తం బోనీ కపూర్‌కు ఫోన్ వచ్చింది. తర్వాత అకౌంట్స్‌ చెక్‌ చేసినప్పుడు తాను డబ్బు పోగోట్టుకున్నట్లు గ్రహించారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన డబ్బు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లోని ఒక అధికారి పేర్కొన్నారు.

నిర్మాతగా బోనీ కపూర్ అనేక సినిమాలను నిర్మించాడు. అజిత్ హీరోగా నటించిన  `నేర్కొండ పార్వై`, ‘వలీమై’(Valimai), పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాలకు  నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం అజయ్ దేవగణ్‌తో ‘మైదాన్’(Maidaan)ను నిర్మిస్తున్నాడు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?